logo

ఉపాధ్యాయులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

Published : 29 Jun 2024 13:33 IST

పర్లాఖెముండి: గజపతి జిల్లా మోహన సమితి పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సమితి విద్యాధికారి నరేంద్ర బెహరా గురువారం ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో జీవిత భద్రత కోసం ద్విచక్ర వాహనాల్లో పాఠశాలకు, వేరే ప్రాంతాలకు వెళ్లే ఉపాధ్యాయులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఒకవేళ హెల్మెట్ ధరించకుండా ఎవరైనా కనిపిస్తే ఒక నెల రోజుల జీతం నిలిపివేయడం జరుగుతుందని ప్రకటనలో తెలిపారు. ఈ విధంగా జిల్లా అంతట అన్ని శాఖల వారు కూడా ఇలాంటి నియమాలు తీసుకొస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని