logo

Odisha: ఆంత్రాక్స్‌తో ఆరుగురికి అస్వస్థత

కోరాపుట్ జిల్లాలో ఈ ఏడాది ఆంత్రాక్స్ జోరుగా వ్యాపిస్తుంది.

Published : 29 Jun 2024 17:33 IST

సిమిలిగుడ: కోరాపుట్ జిల్లాలో ఈ ఏడాది ఆంత్రాక్స్ జోరుగా వ్యాపిస్తుంది. కొద్ది రోజుల క్రితం లక్ష్మిపూర్, దశ మంత్‌పూర్ సమితిలలో ఆంత్రాక్స్ తీవ్ర రూపం దాల్చగా తాజాగా కొరాపుట్ సమితిలో బయటపడింది. సమితి పరిధిలో దేవ్ ఘటి పంచాయతీకి చెందిన పొడయి గుడ గ్రామంలో ఆంత్రాక్స్ వ్యాపించింది. దీని వల్ల ఆరుగురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నిల్వ ఉంచిన మాంసాన్ని గిరిజనులు తినడం వల్ల శుక్రవారం ఆరుగురికి శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వెంటనే వారిని మతాల్ పుట్ ఆరోగ్య కేంద్రానికి తీసువెళ్ళారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నట్టు తెలిపారు. వారి రక్తంను సేకరించి, భువనేశ్వర్‌కు పరీక్ష కోసం పంపారు. ఇద్దరికి ఆంత్రాక్స్ వ్యాధి వ్యాపించినట్లు నివేదిక రావడంతో శనివారం ప్రత్యేక వైద్య బృందం గ్రామానికి వెళ్లి ఇంటింటా వైద్యం అందించడం ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని