logo

Odisha: సర్పంచి తొలగింపు

గజపతి జిల్లా గుమ్మ సమితి జీబ పంచాయతీ సర్పంచి పదవిలో ఉన్న ఎడంగా సబర్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 03 Jul 2024 19:52 IST

పర్లాఖెముండి: గజపతి జిల్లా గుమ్మ సమితి జీబ పంచాయతీ సర్పంచి పదవిలో ఉన్న ఎడంగా సబర్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. గత పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ఎడంగా సబర్ ఇద్దరు పిల్లల సంతానం కలిగి ఉన్నానని ఎన్నికల అధికారికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ముగ్గురు సంతానం కలిగి ఉన్నాడని ప్రత్యర్థి అభ్యర్థి రవీంద్ర సబర్ జిల్లా కోర్టు, ఉన్నత న్యాయస్థానం ఆశ్రయించాడు. దీంతో విచారించిన ఉన్నత న్యాయస్థానం సర్పంచి పదవులో ఉన్న ఎడంగా  తప్పుడు పత్రాలు సమర్పించాడని పూర్తి విచారణలో రుజువు కావడంతో అతన్ని పదవి నుంచి‌ తొలగొంచి రవీంద్రను సర్పంచ్‌గా నియమిస్తున్నట్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని