logo

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్ర పర్యటన ఖరారు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 4 రోజులు రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఆమె పూరీ, భవనేశ్వర్‌లలో ఏర్పాటయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్‌ అహుజా సోమవారం రాత్రి లోక్‌సేవాభవన్‌లో వివిధ శాఖల ప్రిన్సిపల్‌ కార్యదర్శులు, డీజీపీలతో సమావేశమై భద్రత, ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు.

Published : 03 Jul 2024 03:13 IST

భద్రతపై అధికారులతో సీఎస్‌ సమీక్ష

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 4 రోజులు రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఆమె పూరీ, భవనేశ్వర్‌లలో ఏర్పాటయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్‌ అహుజా సోమవారం రాత్రి లోక్‌సేవాభవన్‌లో వివిధ శాఖల ప్రిన్సిపల్‌ కార్యదర్శులు, డీజీపీలతో సమావేశమై భద్రత, ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు.

శనివారం సాయంత్రం రాక

శనివారం (6న) సాయంత్రం ద్రౌపదీ ముర్ము భువనేశ్వర్‌ చేరుకుంటారు. రాజ్‌భవన్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని జయదేవ్‌ భవన్‌కు వెళతారు. ఇక్కడ ఉత్కళమణి గోపబంధు దాస్‌ 96వ వర్థంతి కార్యక్రమంలో పాల్గొని రాజ్‌భవన్‌లో రాత్రి బస చేస్తారు. 7న పూరీ చేరుకొని రథయాత్ర తిలకిస్తారు. రాత్రి పూరీలోని రాజ్‌భవన్‌లో విశ్రాంతి తీసుకోనున్న రాష్ట్రపతి సోమవారం భువనేశ్వర్‌ వస్తారు. రాజధానిలో ఆమె ఖండగిరి, ఉదయగిరిలలో జైనుల పాలనాకాలంనాటి గుహలను తిలకిస్తారు. అనంతరం బిభూతికానుంగో ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత భువనేశ్వర్‌లోని డిజైన్‌ రిట్రీట్‌ సెంటర్‌లో ఏర్పాటయ్యే మరో కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి రాజ్‌భవన్‌లో విశ్రాంతి తీసుకుని మంగళవారం మధ్యాహ్నం భువనేశ్వర్‌ నైజర్‌ విద్యాసంస్థ 13వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. సాయంత్రం దిల్లీ ప్రయాణమవుతారు.

ఉన్నతాధికారులతో సీఎస్‌ సమావేశం

గట్టి బందోబస్తు

రాష్ట్రపతి పాల్గొననున్న కార్యక్రమాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ట్రాఫిక్‌ నియంత్రణ తదితరాలపై దృష్టి సారించినట్లు డీజీపీ అరుణ్‌ షడంగి వివరించారు. పాత్రికేయులు వార్తల కవరేజీకి సంబంధించి ప్రత్యేక ‘ఐ’కార్డులు జారీచేస్తున్నామని ఆయాచోట్ల ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఐఅండ్‌పీఆర్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సంజయ్‌ కుమార్‌ సింగ్‌ చెప్పారు. పూరీ రథయాత్ర తిలకించనున్న రాష్ట్రపతి ఆసీనులయ్యే ప్రాంతాన్ని కార్డన్‌గా చేస్తున్నామని, ఇక్కడికి ఎవరూ ప్రవేశించకుండా బందోబస్తు ఉంటుందని, బీచ్‌లో ఆమె మార్నింగ్‌వాక్‌ చేసే సమయంలోనూ ఆయాచోట్ల బలగాలను నియమిస్తున్నట్లు సెక్యూరిటీ ఐజీ సంజయ్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని