logo

కొద్దిరోజుల్లో రూ.3 వేల పింఛను

సామాజిక భద్రత కార్యక్రమం కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛను రూ.3 వేలు చొప్పున ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రాథమిక విద్య, సామాజిక భద్రత, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి నిత్యానంద గొండొ చెప్పారు.

Published : 03 Jul 2024 03:09 IST

మూతపడిన పాఠశాలలు తెరిపిస్తాం
ప్రాథమిక విద్యాశాఖ మంత్రి నిత్యానంద

నిత్యానంద గొండొ

భువనేశ్వర్, న్యూస్‌టుడే: సామాజిక భద్రత కార్యక్రమం కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛను రూ.3 వేలు చొప్పున ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రాథమిక విద్య, సామాజిక భద్రత, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి నిత్యానంద గొండొ చెప్పారు. మంగళవారం భువనేశ్వర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ త్వరలో ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశ పెట్టనుందని, సామాజిక భద్రత కార్యక్రమానికి ఎన్ని నిధులు కేటాయిస్తారో పరిశీలిస్తామని, ఆర్థికశాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాత పెంచిన పింఛన్లు చెల్లిసామన్నారు. రూ.500లుగా ఉన్న ఈ పింఛను మొత్తాన్ని గత ప్రభుత్వం రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. భాజపా అధికారంలోకి వస్తే దీనిని రూ.3000 చేస్తామన్న ఆ పార్టీ నేతలు 100 రోజుల్లో పెంచిన మొత్తం ఇస్తామన్నారు.

పరిశీలన జరుగుతోంది

విద్యార్థుల సంఖ్య తగ్గిందన్న కారణంతో గత ప్రభుత్వం చాలాచోట్ల ప్రాథమిక పాఠశాలలు మూసేసిందని, ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువ పాఠశాలలు మూతపడ్డాయని నిత్యానంద చెప్పారు. విద్యార్థుల సంఖ్య తగ్గలేదని, ఉద్దేశపూర్వకంగా మూసేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని, దీనిపై ప్రస్తుతం పరిశీలన జరుగుతోందని మంత్రి చెప్పారు. త్వరలో ఇలాంటి స్కూళ్లను తెరిపించి ఉపాధ్యాయులను నియమిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని