logo

సెప్టెంబరు 17న ‘సుభద్ర’ శుభారంభం

మహిళలకు సంబంధించి ప్రతిష్ఠాత్మక ‘సుభద్ర’ పథకాన్ని సెప్టెంబరు 17న ప్రధాని జన్మదినంనాడు నరేంద్రమోదీ స్వయంగా ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ మాఝి చెప్పారు.

Published : 01 Jul 2024 05:57 IST

ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: సీఎం మోహన్‌

ప్రధాని మోదీతో సీఎం, డిప్యూటీ సీఎంలు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: మహిళలకు సంబంధించి ప్రతిష్ఠాత్మక ‘సుభద్ర’ పథకాన్ని సెప్టెంబరు 17న ప్రధాని జన్మదినంనాడు నరేంద్రమోదీ స్వయంగా ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ మాఝి చెప్పారు. శనివారం రాత్రి దిల్లీలో నీలాంచల్‌ ఒడియా సమితి ప్రతినిధులు సీఎం, ఉపముఖ్యమంత్రులు కనకవర్ధన్‌ సింగ్, ప్రభాతి పరిడలను సన్మానించారు. ఈ సందర్భంగా మోహన్‌ మాట్లాడుతూ... మహిళలకు రూ.50 వేలు చొప్పున సుభద్ర పథకం కింద నగదు పంపిణీ చేస్తామని భాజపా మేనిఫెస్టోలో చెప్పామని, దీన్ని 100 రోజుల్లో అమలు చేస్తామని తెలిపామని, దానికి కట్టుబడి తొలి కేబినెట్‌ సమావేశంలో తీర్మానించిన సంగతి గుర్తు చేశారు. సుభద్ర పథకం ప్రారంభానికి ప్రధానిని ఆహ్వానించామని, ఆయన అంగీకరించారని, 17న ఆయన  పథకాన్ని ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ మాఝి చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని