logo

సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన మనోజ్‌

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా మనోజ్‌ అహుజా ఆదివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈయన హరియాణాకు చెందిన ఒడిశా క్యాడర్‌ అధికారి. లోక్‌సేవాభవన్‌ (సచివాలయం)కు వచ్చిన మనోజ్‌ను ఉద్యోగ విరమణ చేసిన ప్రదీప్‌కుమార్‌ ఆహ్వానించి కార్యాలయానికి తీసుకొచ్చారు.

Published : 01 Jul 2024 05:56 IST

సంతకం చేస్తున్న మనోజ్‌ 

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా మనోజ్‌ అహుజా ఆదివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈయన హరియాణాకు చెందిన ఒడిశా క్యాడర్‌ అధికారి. లోక్‌సేవాభవన్‌ (సచివాలయం)కు వచ్చిన మనోజ్‌ను ఉద్యోగ విరమణ చేసిన ప్రదీప్‌కుమార్‌ ఆహ్వానించి కార్యాలయానికి తీసుకొచ్చారు. పుష్ఫగుచ్ఛం అందజేసి స్వాగతించిన ప్రదీప్‌ మనోజ్‌కు బాధ్యతలప్పగించి అభినందించారు. ఈ వేడుకలో లోక్‌సేవాభవన్‌కు చెందిన కొందరు అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఆదివారం ఆయన దిల్లీ నుంచి భువనేశ్వర్‌ వచ్చారు. ఆయనకు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మనోజ్‌ విలేకరులతో మాట్లాడుతూ... ఇదివరకు ఒడిశాలో విధులు నిర్వహించిన తనకు ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను త్రికరణ శుద్ధితో నిర్వహిస్తానని చెప్పారు. 

తప్పులుంటే మన్నించండి: ప్రదీప్‌

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఏదైనా చేయగలరు. అసాధ్యమేం లేదు’ అన్న అభిప్రాయం వాస్తవం కాదని ఆదివారం ఉద్యోగ విరమణ చేసిన ప్రదీప్‌కుమార్‌ జెనా సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలు, పరిమితులకు లోబడి వ్యవహరించాలని, అన్ని శాఖల మధ్య సమన్వయం, కార్యక్రమాల అమలు కత్తితో సాము వంటిదన్నారు. తాను సీఎస్‌గా పోస్టుకు పూర్తి న్యాయం చేశానని చెప్పుకోవడం లేదని, తప్పిదాలుంటే పెద్ద మనస్సుతో మన్నించాలన్నారు. ఇకపై తాను సాధారణ పౌరుడినని, ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని