logo

కాలువలు శుభ్రం చేయాలి.. ఇబ్బంది లేకుండా చూడాలి

బీఈఎంసీ పరిధిలోని కాలువల్లో మురుగు నిలిచిపోకుండా చూడాలని, కాలువలు శుభ్రం చేసేందుకు తగు యంత్ర పరికరాలతోపాటు పారిశుద్ధ్య సిబ్బందిని పెంచాలని బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి అన్నారు.

Published : 29 Jun 2024 03:26 IST

అధికారులు, స్టాండింగ్‌కమిటీ సభ్యులతో మాట్లాడుతున్న మేయరు దొళాయి

బ్రహ్మపుర బజారు, న్యూస్‌టుడే: బీఈఎంసీ పరిధిలోని కాలువల్లో మురుగు నిలిచిపోకుండా చూడాలని, కాలువలు శుభ్రం చేసేందుకు తగు యంత్ర పరికరాలతోపాటు పారిశుద్ధ్య సిబ్బందిని పెంచాలని బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి అన్నారు. బీఈఎంసీలోని మేయరు కార్యాలయంలో గురువారం సాయంత్రం డ్రైనేజీ విభాగం, స్టాండింగ్‌ కమిటీలతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఇందులో మేయరు దొళాయి మాట్లాడుతూ కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని మేయరు దొళాయి పేర్కొన్నారు. ఇందుకు బీఈఎంసీలో ప్రత్యేక నియంత్రణ గదిని తెరిచి రెండు ఫోను నెంబర్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆమె సూచించారు.. భారీ వర్షాలు కురిసినప్పుడు రహదారులు జలమయం కాకుండా చూడాలని, అటువంటి సమయాల్లో యంత్రాలను వినియోగించి కాలువల్లో నీరు సజావుగా పారేలా చర్యలు ముమ్మరం చేయాలని మేయరు దొళాయి అధికారులకు సూచించారు. మరోవైపు నగరంలో కొన్ని కాలువల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. వర్షాలు పడుతున్నప్పుడు ఏది కాలువో, ఏది రహదారో తెలియక ప్రమాదాలు సంభవిస్తున్నాయని,  అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బీఈఎంసీ ఉపకమిషనర్‌ ఆశీర్వాద్‌ పరిడా మాట్లాడుతూ నగరంలో కాలువల్లో చెత్త తొలగింపు, పూడికతీత పనులు కొనసాగుతున్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని