logo

అలరించిన నృత్యాలు

‘రాష్ట్రేతర తెలుగు సమాఖ్య’  (రాతెస) గురువారం వర్చువల్‌లో నిర్వహించిన 9వ వార్షికోత్సవాల్లో బ్రహ్మపుర కళాకారులు సందడి చేశారు. బ్రహ్మపురానికి చెందిన ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజం(ఏబీవీఎస్‌) రాతెస అనుబంధ సంస్థ. ఏబీవీఎస్‌ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు.

Published : 29 Jun 2024 03:26 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ‘రాష్ట్రేతర తెలుగు సమాఖ్య’  (రాతెస) గురువారం వర్చువల్‌లో నిర్వహించిన 9వ వార్షికోత్సవాల్లో బ్రహ్మపుర కళాకారులు సందడి చేశారు. బ్రహ్మపురానికి చెందిన ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజం(ఏబీవీఎస్‌) రాతెస అనుబంధ సంస్థ. ఏబీవీఎస్‌ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. గిరి మార్కెట్‌లోని గంటన్నరపాటు సాంస్కృతికోత్సవాలు అలరించాయి. నగరానికి చెందిన ‘అన్నమయ్య సంకీర్తనా రవళి’ బృందం అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. యువ గాయకుడు వనమాలి అవినాష్‌ భక్తి గీతాలు, బాలికలు వై.సహస్ర, సీహెచ్‌.దక్షిత, ఆకాంక్షల నృత్యాలు కట్టిపడేశాయి. యువ కళాకారిణి వనమాలి లలితా హాసిని శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. స్థానిక లలితా కల్చరల్‌ అకాడమీ చిన్నారులు నాట్యాలతో ముగ్ధులను చేశారు. వి.చంద్రకళ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించగా, కె.పి.కృష్ణారావు, ఎం.కల్యాణి, ఎస్‌.జానకి, వై.అక్షయ, జి.వి.రామ్‌కుమార్‌ తదితరులు కార్యక్రమ నిర్వహణకు సహకరించారు.

అన్నమయ్య సంకీర్తనా రవళి బృందం సభ్యుల కీర్తనాలాపనలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని