logo

రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తాం..!

రాష్ట్రాభివృద్ధికి సహాయసహకారాలు అందిస్తామని, డబుల్‌ ఇంజిన్‌ పాలనలో రానున్న అయిదేళ్లలో ఒడిశా అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి చెప్పారు.

Published : 29 Jun 2024 03:25 IST

సీఎంకు ప్రధాని హామీ

ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌తో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాష్ట్రాభివృద్ధికి సహాయసహకారాలు అందిస్తామని, డబుల్‌ ఇంజిన్‌ పాలనలో రానున్న అయిదేళ్లలో ఒడిశా అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి చెప్పారు. గురువారం రాత్రి దిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌తో సీఎం, ఉపముఖ్యమంత్రుల కనకవర్ధన్‌ సింగ్‌ దేవ్, ప్రభాతి పరిడలు మర్యాదపూర్వకంగా కలిశారు. తరువాత ప్రధాని మోదీతో సమావేశమైన వారంతా భాజపా మేనిఫెస్టో, ఇతర హామీలు నెరవేర్చడానికి సహకరించాలని కోరారు. 2036లో స్వతంత్ర ఒడిశా వందేళ్ల పండగ జరుపుకోనుండగా, ఈ వ్యవధిలో ప్రగతి పరుగులు తీయాలని కోరారు. శుక్రవారం కేంద్రమంత్రులు నితీన్‌ గడ్కరీ, గజేంద్రసింగ్‌ షెకావత్‌లతో సమావేశమయ్యారు. అనంతరం ఒడిశా భవన్‌లో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ... డబుల్‌ ఇంజిన్‌ పాలనలో రాష్ట్రానికి ఇబ్బందులుండవన్నారు. రథయాత్రలో పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముని కోరామని, ఆమె అంగీకారం తెలిపారన్నారు. ఈ సందర్భంగా ఒడిశా భవన్‌లో ప్రముఖులు సీఎంను కలిశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని