logo

రాయగడ డీఎల్‌వో సస్పెన్షన్‌

రాయగడ జిల్లా కార్మికశాఖ అధికారి (డీఎల్‌వో)పై సస్పెన్షన్‌ వేటు పడింది. క్రమశిక్షణ చర్యల ఉల్లంఘన నేరారోపణ కింద డీఎల్‌వో జాస్మిన్‌ సుదర్శిని సాహును విధుల నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 29 Jun 2024 03:24 IST

జాస్మిన్‌ సుదర్శిని సాహు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా కార్మికశాఖ అధికారి (డీఎల్‌వో)పై సస్పెన్షన్‌ వేటు పడింది. క్రమశిక్షణ చర్యల ఉల్లంఘన నేరారోపణ కింద డీఎల్‌వో జాస్మిన్‌ సుదర్శిని సాహును విధుల నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జాస్మిన్‌పై సస్పెన్షన్‌ ఉన్నంత కాలం కార్మికశాఖ కమిషనర్‌ అనుమతి లేకుండా ఆమె జిల్లా కేంద్రాన్ని విడిచి ఎక్కడకీ వెళ్లరాదని ఉత్తర్వులో స్పష్టం చేసింది. ఒడిశా సర్వీస్‌ కోడ్‌-90 నియమావళి ప్రకారం... జీవనోపాధి భృతికి మాత్రమే ఆమె ప్రస్తుతానికి అర్హురాలని అందులో స్పష్టం చేసింది. మృతి చెందిన అసంఘటిత, నిర్మాణ కార్మికుల కుటుంబాలకు సర్కార్‌ చెల్లించే పరిహారం విషయంలో అధికారులు పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాయగడ జిల్లా కార్మిక శాఖ అధికారులపై విచారణ జరపాల్సిందిగా రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌ కార్యాలయం ఆదేశించింది. దీనికితోడు ప్రభుత్వం తరఫున తమకు ఇంతవరకు ఎలాంటి పరిహారం అందలేదని మునిగుడ సమితి అంబోదల గ్రామం హరిజన్‌ వీధికి చెందిన పలువురు బాధిత కార్మిక కుటుంబ సభ్యులు కొద్ది రోజుల క్రితం కలెక్టర్‌కు విన్నవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్కార్‌ డీఎల్‌వోపై చర్యలు తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని