logo

Odisha: హోటళ్లు, బేకరీలపై ఆహార భద్రతాధికారుల తనిఖీలు

జయపురం పట్టణంలో పలు హోటళ్లు, బేకరీలపై బుధవారం ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేపట్టారు.

Published : 03 Jul 2024 16:44 IST

నవరంగపూర్‌: జయపురం పట్టణంలో పలు హోటళ్లు, బేకరీలపై బుధవారం ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేపట్టారు. సబ్‌ డివిజనల్‌ ఆహార భద్రత శాఖాధికారి ప్రభాష్‌కుమార్‌ నేతృత్వంలో శానిటరీ నిపుణుడు ఎ.రాజశేఖర్‌, పురపాలిక అధికారులు ప్రసాద్ కుమార్, భవాన్ హ్యూ తదితరులు బృందాలుగా ఏర్పడి దుకాణాలపై దాడి చేశారు. విక్రమ్ దేవ్ కళాశాల, ఈ ప్రధాన ట్రాఫిక్ చౌక్ ప్రాంతాల్లో ఉన్న దాదాపు 25 దుకాణాలపై దాడి చేయగా, 17 దుకాణాల్లో గడువు ముగిసిన సాస్‌లు, ఆహార పదార్ధాలు ఉపయోగించటంతో దాదాపు రూ.36వేలు జరిమానా వసూలు చేశారు. మరో రెండు రోజుల్లో మళ్ళీ తనిఖీలు చేస్తామని, మరోసారి ఆహార పదార్థాల్లో నాణ్యత లోపం కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు