logo

నీట్‌ ఫలితాలపై సమగ్ర విచారణ జరిపించాలి

నీట్‌ ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్‌ మస్తాన్‌ షరీఫ్‌ డిమాండ్‌ చేశారు

Published : 05 Jul 2024 03:39 IST

వీఆర్సీ కూడలిలో రాస్తారోకో చేస్తున్న విద్యార్థి సంఘాల ఐక్యవేదిక నాయకులు

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: నీట్‌ ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్‌ మస్తాన్‌ షరీఫ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుట్రతో పేపర్‌ లీక్‌ చేస్తే, విచారణ జరిపించాల్సిన కేంద్ర ప్రభుత్వం మిన్నకుండి పోవడం దారుణమన్నారు.  ముందుగా ఆయా విద్యా సంస్థల వద్ద విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు. అనంతరం వీఆర్సీ కూడలిలో  రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి హర్ష, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సునీల్, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వీవీఎస్‌ చైతన్య, నరేంద్ర, నగర అధ్యక్షుడు శివమ్‌వర్మ, పీడీఎస్‌యూ గ్రామీణ అధ్యక్షుడు షారుఖ్, అక్షయ్, ఆకాష్, శరణ్, సాయి, ప్రతాప్, అల్తాఫ్, అబ్దుల్, చరణ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని