logo

అనర్హులకు మత్స్యకార భరోసా

వేట విరామ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే మత్స్యకార భరోసాలో అనర్హులు పాగా వేశారు. దీని కింద ప్రభుత్వం రూ. పదివేలు ఇచ్చి ఆదుకుంటుండగా- సదరు జాబితాలో కొందరు వైకాపా నాయకులు మత్స్య వేట తెలియని వారి పేర్లు నమోదు చేయించారు.

Published : 03 Jul 2024 02:58 IST

వైకాపా నాయకుల నిర్వాకం

ఇందుకూరుపేట, న్యూస్‌టుడే: వేట విరామ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే మత్స్యకార భరోసాలో అనర్హులు పాగా వేశారు. దీని కింద ప్రభుత్వం రూ. పదివేలు ఇచ్చి ఆదుకుంటుండగా- సదరు జాబితాలో కొందరు వైకాపా నాయకులు మత్స్య వేట తెలియని వారి పేర్లు నమోదు చేయించారు. మండలంలోని కుడితిపాళెంలో ఈ విషయం వెలుగు చూసింది. ఏప్రిల్‌ నెలలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసాకు అర్హులైన వారి పేర్లు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే అదనుగా వైకాపా నాయకులు 221 మంది పేర్లతో జాబితా పంపించారు. అందులో అనేక మంది వేట తెలియని.. ఇతర సామాజికవర్గీయులు ఉన్నట్లు వెలుగు చూసింది.  దీనిపై స్థానిక తెదేపా నాయకులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గ్రామ సచివాలయ మత్స్యశాఖ సహాయకురాలు దీక్షితను వివరణ కోరగా.. అనర్హుల పేర్లు ఎలా నమోదు చేశారని ప్రశ్నించగా.. నాయకుల ఒత్తిళ్ల మేరకే చేశామని, వాటిని తొలగించాలని ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిపారు. అనర్హులందరూ వైకాపా కార్యకర్తలే కావడం గమనార్హం. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. అర్హులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు