logo

ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: మంత్రి ఆనం

ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

Published : 03 Jul 2024 02:38 IST

 ఆర్‌అండ్‌బీ అతిథి గృహం పరిశీలిస్తున్న మంత్రి ఆనం, నాయకులు, అధికారులు

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం పీఆర్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, రెవెన్యూ, పురపాలక అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదట ఆయన ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్, అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కళాశాలకు ప్రహరీ నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. పాలిటెక్నిక్‌ కళాశాల, బాలికల గురుకుల పాఠశాలలకు సోమశిల తాగునీటిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా కనెక్షన్‌లు ఇవ్వాలని పురపాలక కమిషనర్‌ను ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ అతిథి గృహాలను పరిశీలించారు. వ్యవసాయ సీజన్‌ వస్తున్నందున పంటపొలాలకు సజావుగా సాగునీరందేలా అన్ని కాలువలు సిద్ధం చేయాలన్నారు. ఆత్మకూరు పట్టణంలో ఆగిన రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు నివేదికలు సిద్ధం చేయాలన్నారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, ఎన్‌డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, కిమ్స్‌ ఈడీ టి.గిరినాయుడు, ఆర్డీవో మధులత, ఛైర్‌పర్సన్‌ వెంకటరమణమ్మ, ఎంపీపీ కేతా వేణుగోపాల్‌రెడ్డి, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని