logo

సృజనాత్మకత.. నృత్య ఘనత

ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన  వాడరేవు శ్రీలయ భరతనాట్యంలో ప్రావీణ్యాన్ని సాధించింది. తల్లిదండ్రులు వీవీఆర్‌ ఫణీంద్రకుమార్, ప్రసూన కుమారి ప్రోత్సాహంతో నేర్చుకున్న నృత్యాన్ని పలు వేదికలపై ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటుంది.

Published : 03 Jul 2024 02:31 IST

ఆదర్శం.. నెల్లూరు యువతులు

సృజనాత్మక కళా వైభవానికి నిదర్శనంగా శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం సాధించారు.. యువతులు. చదువుతూనే
ఆసక్తి ఉన్న కళల్లో శిక్షణ తీసుకుని కళాకారిణులుగా ప్రదర్శనలు ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. నెల్లూరు నగరానికి చెందిన శ్రీలయ, లక్ష్మీప్రియ.

న్యూస్‌టుడే, నెల్లూరు(సాంస్కృతికం)

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..

ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన  వాడరేవు శ్రీలయ భరతనాట్యంలో ప్రావీణ్యాన్ని సాధించింది. తల్లిదండ్రులు వీవీఆర్‌ ఫణీంద్రకుమార్, ప్రసూన కుమారి ప్రోత్సాహంతో నేర్చుకున్న నృత్యాన్ని పలు వేదికలపై ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటుంది. 2022లో ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల నిర్వహించిన పరీక్షల్లో సర్టిఫికెట్‌ కోర్సును ప్రథమశ్రేణిలో పూర్తిచేసింది. పలు ప్రముఖ ఆలయాల్లో జరిగే వేడుకలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నృత్య ప్రదర్శనకు అవకాశాన్ని దక్కించుకుంది. జిల్లాస్థాయిలో నిర్వహించిన పలు పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకుంది. భవిష్యత్తులో ఉత్తమ నృత్య కళాకారిణిగా పేరుతెచ్చుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపింది.

చదువు... నాట్యం

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు బృంద ప్రదర్శనలో పాల్గొని ప్రతిభను చాటుకుంది.. విడవలూరి లక్ష్మీప్రియ. ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన ఆమె ఉన్నత చదువులు అభ్యసించేందుకు సన్నద్ధం అవుతూనే నృత్యంలో ప్రావీణ్యాన్ని చాటుకునే ప్రదర్శనలిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. నగరంలోని గురుకృపా కళాక్షేత్రంలో నృత్య శిక్షణను తీసుకుని తిరుమల నాదనీరాజనంలో ప్రదర్శనల్చింది. భరతనాట్యంలో పలు నృత్యరీతులను అలవోకగా ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్న లక్ష్మీప్రియ నృత్యఝరీ పురస్కారాన్ని అందుకుంది. తల్లిదండ్రులు మధుసూదన్, గాయత్రిల సహకారంతో భరతనాట్యంలో ఉత్తమ కళకారిణిగా రాణించాలన్నదే లక్ష్యమంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని