logo

హతవిధీ.. నగర సొగసిది!

నెల్లూరు నగరంలో ఆదివారం అర్ధరాత్రి గాలివానతో కురిసిన వర్షం.. ప్రజలకు నిద్ర లేకుండా చేసింది. పలు ప్రాంతాల్లో చెట్లు కూలగా, విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.

Published : 02 Jul 2024 03:06 IST

నెల్లూరు నగరంలో ఆదివారం అర్ధరాత్రి గాలివానతో కురిసిన వర్షం.. ప్రజలకు నిద్ర లేకుండా చేసింది. పలు ప్రాంతాల్లో చెట్లు కూలగా, విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. వర్షపు నీరు సాఫీగా వెళ్లే దారిలేక.. ఎక్కడికక్కడ నిలిచిపోగా.. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మురుగునీటి కాలువలు పొంగిపొర్లి.. వర్షపు నీటితో కలిసి సాగాయి. అండర్‌ బ్రిడ్జిల వద్ద వాహనదారులు అవస్థలు పడగా.. ఇరుకళల సంఘం, వైఎస్‌ఆర్‌నగర్, డ్రైవర్స్‌ కాలనీ, గాంధీబొమ్మ, నవాబుపేట ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఈనాడు, నెల్లూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని