logo

భవనంపై నుంచి దూకి వైద్యురాలి ఆత్మహత్య

వైద్య కళాశాల భవనం పైనుంచి దూకి వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన సోమవారం నెల్లూరు జీజీహెచ్‌లో చోటు చేసుకుంది.

Published : 02 Jul 2024 02:58 IST

వైద్యుల దినోత్సవం రోజే దుర్ఘటన

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: వైద్య కళాశాల భవనం పైనుంచి దూకి వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన సోమవారం నెల్లూరు జీజీహెచ్‌లో చోటు చేసుకుంది.  వైద్యుల దినోత్సవం రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం అందరినీ కలచివేసింది. వైద్యుల వివరాల మేరకు.. నల్గొండకు చెందిన జ్యోతి (38), నెల్లూరుకు చెందిన రవికి 2014లో వివాహమైంది. జ్యోతి చేజర్ల మండలం చిత్తలూరు పీహెచ్‌సీలో వైద్యాధికారిణిగా, రవి జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆర్థోపెడిక్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. వీరికి మూడేళ్ల పాప ఉంది. నారాయణ ఆసుపత్రి సమీపంలో నివాసం ఉంటున్నారు. డాక్టర్‌ జ్యోతి సోమవారం జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌పై నిర్వహించిన శిక్షణకు హాజరయ్యారు. మధ్యాహ్నం వరకు బాగున్నారు. భోజనం అనంతరం ఫోను రాగానే, ఒకటో అంతస్తు నుంచి నాలుగో అంతస్తుకు వెళ్లి.. అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వైద్యాధికారులు తక్షణ చికిత్సతో పాటు సీపీఆర్‌ చేసినా ఫలితం లేకపోయింది. దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  నల్గొండ నుంచి మృతురాలి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని