logo

బయోటెక్నాలజీలో విస్తృత అవకాశాలు

బయోటెక్నాలజీ విభాగంలో ప్రపంచంలోని అన్ని దేశాల్లో విస్తృత అవకాశాలున్నాయని విద్యార్థులు వాటిని అందుపుచ్చుకుని ముందుకు వెళ్లాలని అమెరికాలో శాస్త్రవేత్తగా పని చేస్తున్న హేమంత్‌కుమార్‌ సూచించారు.

Published : 02 Jul 2024 02:51 IST

మాట్లాడుతున్న హేమంత్‌కుమార్‌

వెంకటాచలం, న్యూస్‌టుడే: బయోటెక్నాలజీ విభాగంలో ప్రపంచంలోని అన్ని దేశాల్లో విస్తృత అవకాశాలున్నాయని విద్యార్థులు వాటిని అందుపుచ్చుకుని ముందుకు వెళ్లాలని అమెరికాలో శాస్త్రవేత్తగా పని చేస్తున్న హేమంత్‌కుమార్‌ సూచించారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌పై జరిగిన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ తర్వాత బయోటెక్నాలజీ రంగం మరింత ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. ప్యాక్రియాటిక్‌ క్యాన్సర్‌లో వచ్చే జన్యు మార్పులు, తాను చేసిన పరిశోధనలను వివరించారు. బయోటెక్నాలజీలో పీజీ చేసిన తరువాత లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వివరించారు. కార్యక్రమంలో ఆచార్యులు విజయానంద కుమార్‌ బాబు, అల్లం ఉదయ్‌ శంకర్, కిరణ్మయి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని