logo

రాష్ట్ర స్థాయి నాటుబండి ఎడ్ల పోటీలు

విడవలూరు మండలం రామతీర్థంలో రాష్ట్ర స్థాయి నాటుబండి ఎడ్ల పోటీలు సోమవారం పోటాపోటీగా జరిగాయి.

Published : 02 Jul 2024 02:49 IST

రామతీర్థంలో బండి లాగుతున్న ఎడ్లు

విడవలూరు : విడవలూరు మండలం రామతీర్థంలో రాష్ట్ర స్థాయి నాటుబండి ఎడ్ల పోటీలు సోమవారం పోటాపోటీగా జరిగాయి. శ్రీకామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో రావణసేవ సందర్భంగా గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 20 జతల ఎండ్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలు చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. మొదటి బహుమతి జొన్నవాడకు చెందిన ఎండ్లు, రెండో బహుమతి బాపట్ల జిల్లాకు చెందిన కడవకుదురు ఎడ్లు, మూడో బహుమతి అల్లూరు మండలం తూర్పుగోగులపల్లి ఎడ్లు, నాలుగో బహుమతి బాపట్ల జిల్లా వేటపాలెం ఎడ్లు, అయిదో బహుమతి అల్లూరు మండలం గోగులపల్లి ఎడ్ల జత కైవసం చేసుకున్నాయి. మొదటి విజేతకు ఎల్లసిరి లక్ష్మయ్య గౌడ్‌ రూ.30వేలు, ఉప్పల ఈశ్వరయ్య గౌడ్‌ రెండో విజేతకు రూ.20వేలు, మూడో విజేతకు రూ.15వేలు ఉప్పల శివకృష్ణ గౌడ్, నాలుగో విజేతకు నాసిన వెంకట శేషయ్య గౌడ్‌ రూ.10వేలు, ఐదో విజేతకు రూ.8వేలు అత్తిరాల శ్రీనివాసులు గౌడ్‌ అందజేశారు. ఈ సందర్భంగా బాషా యూత్‌ ఫౌండేషన్, ఎడ్లబండి పోటీల నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం, కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని