logo

నేడు పింఛన్ల పంపిణీ

తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జులై 1న ‘ఎన్టీఆర్‌ భరోసా’ పేరిట నేరుగా ఇంటి వద్దకే సామ్ము పంపిణీ చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

Published : 01 Jul 2024 05:39 IST

ఇంటి వద్దే ఇవ్వనున్న అధికారులు

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జులై 1న ‘ఎన్టీఆర్‌ భరోసా’ పేరిట నేరుగా ఇంటి వద్దకే సామ్ము పంపిణీ చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఉదయం ఆరు గంటలకే పంపిణీ ప్రారంభించనున్నారు. ఒకేసారి రూ.వెయ్యి పెంచడడం, అదనంగా మరో రూ.3 వేలు.. మొత్తం రూ.7 వేలు అందజేయనుండటంతో అవ్వాతాతలు, ఇతర లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అన్ని రకాల కేటగిరీల్లో 3,13,757 మందికి రూ.214,50,69,500 అందించనున్నారు. 8,500 మంది సచివాలయ సిబ్బంది పింఛన్లను ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయనున్నారు. మొదటి రోజే వంద శాతం పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. సాంకేతిక.. ఇతరత్రా సమస్యలు తలెత్తితే మరుసటి రోజు అందించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి తెలిపారు.

జిల్లాలో ఇలా.. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో 6,021 పింఛనుదారులకు రూ.4,15,41,501, నెెల్లూరు అర్బన్‌లో 47,315 మందికి రూ.32,66,51,501, కోవూరులో 42,797 మందికి రూ.29,46,36,000, కావలిలో 37,479 మందికి రూ.25,68,38,000, ఉదయగిరిలో 41,054 మందికి రూ.27,87,75,000, ఆత్మకూరులో 38,127 మందికి రూ.26,08,12,500, వెంకటగిరిలో 20,343 మందికి రూ.13,88,89,100, సర్వేపల్లిలో 39886 మందికి రూ.27,45,93,500, కందుకూరు నియోజకవర్గంలో 40,735 మంది పింఛనుదారులకు రూ.27,33,30,500 అందజేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని