logo

రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండగ : మంత్రి నారాయణ

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పండగ వాతావరణంలో సామాజిక పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.

Published : 01 Jul 2024 05:35 IST

మాట్లాడుతున్న మంత్రి నారాయణ పక్కన వేమిరెడ్డి, కోటంరెడ్డి

నెల్లూరు(నగరపాలక సంస్థ) : రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పండగ వాతావరణంలో సామాజిక పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి పింఛన్ల పంపిణీపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పింఛన్ల పంపిణీకి సంబంధించిన వివరాలను డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి ప్రజాప్రతినిధులకు వివరించారు. మంత్రిమాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పింఛన్లు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా ఒకటి నుంచి 5వ తేదీ వరకు పింఛన్లు ఇచ్చే వారని, అలా కాకుండా ఒకటి రెండు రోజుల్లోనే ప్రతి ఒక్క లబ్ధిదారునికి పింఛన్లు అందించేందుకు సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌యాదవ్, డిప్యూటీ కమిషనర్‌ చెన్నుడు, ఎస్‌ఈ సంపత్‌కుమార్, ఆరోగ్యాధికారి డాక్టర్‌ వెంకటరమణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు