logo

సెలవు రోజు.. వైద్యానికి స్వస్తి

ప్రతిరోజూ ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేయాలన్న నింబంధనలకు తూట్లు పడుతున్నాయి. పండుగలు, సాధారణ సెలవు రోజుల్లో పీహెచ్‌సీలు మూతపడుతున్నాయి.

Published : 01 Jul 2024 05:33 IST

మూతపడిన అల్లీపురం ఆసుపత్రి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: ప్రతిరోజూ ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేయాలన్న నింబంధనలకు తూట్లు పడుతున్నాయి. పండుగలు, సాధారణ సెలవు రోజుల్లో పీహెచ్‌సీలు మూతపడుతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలందక.. రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు..

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 61 పీహెచ్‌సీ, 497 వైఎస్సార్‌ హెల్త్‌క్లినిక్‌లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలలో ఇద్దరు వైద్యాధికారులు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ఫార్మాసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్, ఎంఎన్‌వో గానీ, ఎఫ్‌ఎన్‌వో, ఎంపీహెచ్‌వో ఇలా మొత్తంగా 14మంది వైద్య సిబ్బంది ఉండేలా ఏర్పాటు చేశారు. ఇద్దరిలో ఒక వైద్యుడు ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యం అందిస్తారు.. మరో వైద్యుడు 104 వాహనం ద్వారా పీహెచ్‌సీ పరిధిలోని వైఎస్సార్‌ హెల్త్‌క్ల్లినిక్‌కు వెళ్లి ఉదయం నుంచి ఓపీ చూడడం, మధ్యాహ్నం నుంచి ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్సలు చేసుకున్న వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికి పరిమితమైన రోగులు, పాఠశాలలు విద్యార్థులు, అంగన్‌వాడీ చిన్నారులకు వైద్య సేవలందిస్తారు. వైద్య సిబ్బంది ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయం మినహాయించి సాయంత్రం 4గంటల వరకు విధుల్లో ఉండాలి.

సేవలు బంద్‌

మధ్యాహ్నం నుంచి జిల్లాలో పలుపీహెచ్‌సీలకు తాళాలు పడుతున్నాయి. అల్లీపురం ఆసుపత్రి తోటపల్లి గూడూరు మండలం వరిగొండ ప్రాథమిక వైద్యశాల, కోవూరు నియోజకవర్గం జగదేవిపేట పీహెచ్‌సీలు ఆదివారం మధ్యాహ్నం తరువాత మూతపడ్డాయి. వీటన్నింటికీ తాళాలు వేసి ఉంచడం గమనార్హం.

మూతపడితే చర్యలు తప్పవు

పీహెచ్‌సీల్లో సెలవు రోజులు, ముఖ్యంగా ఆదివారం మధ్యాహ్నం వరకు వైద్యుడు, సిబ్బంది విధుల్లో ఉంటారు. మధ్యాహ్నం నుంచి సిబ్బంది విధుల్లో ఉండగా, అత్యవసర కేసుల్లో వైద్యుడు అందుబాటులో ఉంటారు. ఆసుపత్రిని మూత వేయకూడదు. ఎక్కడైనా జరిగితే చర్యలు తీసుకుంటాం.

ఎం.పెంచలయ్య, డీఎంహెచ్‌వో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని