logo

పట్టని నిబంధనలు.. ట్రాఫిక్‌ కష్టాలు

ఈ చిత్రం పట్టణంలోని ట్రంకురోడ్డు నుంచి సంకులవారితోటకు వెళ్లే మార్గంలో ఇటీవల ఓ సమావేశ మందిరం నిర్మించారు. దీనికి పార్కింగ్‌ సదుపాయం లేదు.

Published : 01 Jul 2024 05:29 IST

ఈ చిత్రం పట్టణంలోని ట్రంకురోడ్డు నుంచి సంకులవారితోటకు వెళ్లే మార్గంలో ఇటీవల ఓ సమావేశ మందిరం నిర్మించారు. దీనికి పార్కింగ్‌ సదుపాయం లేదు. ఇక్కడ జరిగే కార్యక్రమాలకు హాజరయ్యే వారు తమ వాహనాలు నడిరోడ్డుపైనే నిలుపుతుండడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

న్యూస్‌టుడే, కావలి: పట్టణంలో వాణిజ్య భవనాలు, సమావేశ మందిరాల నిర్మాణంలో వాటి యజమానులు నిబంధనలు పాటించడం లేదు.పెద్దపెద్ద భవనాలు నిర్మించే వారుపురపాలక సంఘం అనుమతి తీసుకొనే సమయంలో వాహనాల నిలుపుదలకు స్థలం చూపించాల్సి ఉంది. చూపించకపోయినా అనుమతివ్వడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో నిర్మించిన వాటి విషయంలో ఏమీ చేయలేకున్నామని, ఇకపై అలాంటివి కట్టకుండా చేస్తామటున్న అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల సంకులవారి తోట, రామ్మూర్తిపేటలో నిర్మించిన వాటికి వాహనాల పార్కింగ్‌ సదుపాయం లేదు. అక్కడ ఏవైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో నిలిపే వాహనాలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సాయిబాబా ఆలయం, ప్రైవేట్‌ ఆసుపత్రి, వివిధ పార్టీల కార్యాలయాలుండడంతో అటుగా వెళ్లే వారి వాహనాలకు ఇబ్బంది తప్పడం లేదు.తహసీల్దార్‌ కార్యాలయం నుంచి తుమ్మలపెంట వైపు వెళ్లే వాహనాలు ఈ మార్గంలో వెళ్లేందుకు సమస్యలు ఎదురవుతున్నాయి.ట్రంకురోడ్డులో ఉన్న వాణిజ్య సముదాయాల ముందు పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. వాహనాలు సగం రోడ్డును ఆక్రమిస్తున్నాయి. దీంతో సాయంత్రం సమయంలో పాదచారులు నడకకు కూడా ఇక్కట్లు తప్పడం లేదు.

జాబితా తయారు చేస్తున్నాం

ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించడం తగదు. నియమాలకు విరుద్ధంగా నిర్మించిన వాటి వివరాలతో జాబితా తయారు చేస్తున్నాం. ఇకపై ఎక్కడా ఇలా కట్టకుండా చూస్తాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తాం.

కొట్టే బాబురావు, పట్టణ ప్రణాళికాధికారి, కావలి పురపాలక సంఘం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని