logo

ఎన్నికల వ్యయంపై అభ్యంతరాలు రాలేదు: జేసీ

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చు చేసిన వ్యయంపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని సంయుక్త కలెక్టర్‌ సేతు మాధవన్‌ తెలిపారు.

Published : 01 Jul 2024 05:26 IST

మాట్లాడుతున్న జేసీ సేతు మాధవన్‌.. వేదికపై వ్యయ పరిశీలకులు

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చు చేసిన వ్యయంపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని సంయుక్త కలెక్టర్‌ సేతు మాధవన్‌ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఎన్నికల వ్యయ రికన్సులేషన్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల మేరకు ఫలితాలు వెలువడిన 26వ రోజున రికన్సులేషన్‌ సమావేశం నిర్వహించి పోటీ చేసిన అభ్యర్థులు చూపిన వ్యయానికి జిల్లా ఎన్నికల వ్యయ పర్యవేక్షణ కమిటీ రూపొందించిన వ్యయానికి రికన్సులేషన్‌ చేయడం ఎన్నికల బాధ్యతల్లో భాగమన్నారు. జిల్లా ఎన్నికల వ్యయ పర్యవేక్షణ కమిటీ తయారు చేసిన వ్యయ నివేదికలపై ఆయా పార్టీల అభ్యర్థులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. ఈ సమావేశంలో వ్యయ పరిశీలకులు ప్రసాద్‌ దత్తాత్రేయ, కాంచన్‌ రామ్‌ మీనా, జ్యోతిమయిబైలంగ్, నోడల్‌ అధికారులు విద్యాసాగర్, తిరుపతయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని