logo

గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం

గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా అదనపు ఎస్పీ సీహెచ్‌ సౌజన్య అన్నారు. ఆదివారం ‘ఈనాడు’లో ‘గంజాయి గుప్పు.. ఏదీ కనువిప్పు’ పేరుతో కథనం ప్రచురితమైంది.

Published : 01 Jul 2024 05:10 IST

వివరాలు వెల్లడిస్తున్న జిల్లా అదనపు ఎస్పీ సౌజన్య

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా అదనపు ఎస్పీ సీహెచ్‌ సౌజన్య అన్నారు. ఆదివారం ‘ఈనాడు’లో ‘గంజాయి గుప్పు.. ఏదీ కనువిప్పు’ పేరుతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన పోలీసులు ఆదివారం నగరంలో దాడులు చేపట్టారు. వివరాలను రాత్రి స్థానిక ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా అదనపు ఎస్పీ వెల్లడించారు. నెల్లూరు గ్రామీణ మండలం గుడిపల్లిపాడుకు చెందిన రంజిత్‌నాయక్, బుధానాయక్, రబీనాయక్‌లను ఆత్మకూరు బస్టాండు వద్ద అదుపులోకి తీసుకుని.. వారి వద్ద 8.430 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరు గతలో నెల్లూరు గ్రామీణ మండలం కొత్త కాలువ సెంటరులోని రైస్‌మిల్లులో పనిచేస్తూ అక్కడే గంజాయి విక్రయించే వారు. ఒడిశాలోని కందమహల్‌ జిల్లా పుల్బాని పట్టణ సమీపంలో కేంజుర్‌కు చెందిన సూరజ్‌ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడించారు. డీఎస్‌ఈవో పోలీసు టీం సిబ్బందిని, నెల్లూరు-1 సెబ్‌ స్టేషన్‌ సిబ్బందిని, ఈఎస్‌ను ఎస్పీ అభినందించినట్లు అదనపు ఎస్పీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని