logo

దుర్గం కొండపై అటవీ శాఖ కూంబింగ్‌

పట్టణంలోని దుర్గంకొండపై వారం రోజులుగా కూంబింగ్‌ నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులు... శనివారం గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల తవ్వకాల కోసం దాచి ఉంచిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Updated : 30 Jun 2024 02:58 IST

గుప్త నిధుల తవ్వకాల సామగ్రి స్వాధీనం

స్వాధీనం చేసుకున్న సామగ్రితో రేంజి అధికారి ఉమామహేశ్వరరెడ్డి, సిబ్బంది

ఉదయగిరి, న్యూస్‌టుడే: పట్టణంలోని దుర్గంకొండపై వారం రోజులుగా కూంబింగ్‌ నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులు... శనివారం గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల తవ్వకాల కోసం దాచి ఉంచిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక రేంజి కార్యాలయంలో అధికారి తుమ్మల ఉమామహేశ్వరరెడ్డి ఆ వివరాలు వెల్లడించారు. యాత్రికులు, పర్యాటకుల రూపంలో కొందరు రిజర్వు అటవీ ప్రాంతంలో దుర్గం కొండపై గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారన్నారు. దానిపై సమాచారం రావడంతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పెద్ద మసీదు సమీపంలోని కోనేరులో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసిన విషయాన్ని కూంబింగ్‌లో గుర్తించామన్నారు. దానికి కొంత దూరంలో రాళ్ల గుట్ట వద్ద వద్ద తవ్వకాల కోసం తెచ్చి దాచి ఉంచిన డ్రిల్లింగ్‌ యంత్రాలు, సమ్మెట తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పురావస్తుశాఖ, పోలీసుల సమన్వయంతో కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు. తవ్వకాల విషయంలో స్థానికులపై అనుమానం ఉందని, వారికి నోటీసులు జారీ చేసి విచారణ చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్వోలు శ్రీనివాసులు, ప్రసాద్, ఎఫ్‌బీవోలు నాయబ్, చిన్నపరెడ్డి, ప్రసాద్, లక్ష్మీప్రసన్న, ఏబీవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని