logo

బిల్లులకు గ్యారంటీ ఇవ్వగలరా?

‘ఇప్పటి వరకు జరిగిన పనుల పరిస్థితి ఏమిటి? వాటికి బిల్లులు వస్తాయనే గ్యారంటీ ఇవ్వగలరా? కొత్త పనులు ప్రారంభించాలా? వద్దా? ఏ పనులు రద్దు చేస్తారో మీరే చెప్పండి’ అని పలువురు జడ్పీటీసీ సభ్యులు పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Published : 30 Jun 2024 02:48 IST

జడ్పీ స్థాయీ సంఘాల సమావేశంలో సభ్యుల ఆందోళన

మాట్లాడుతున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: ‘ఇప్పటి వరకు జరిగిన పనుల పరిస్థితి ఏమిటి? వాటికి బిల్లులు వస్తాయనే గ్యారంటీ ఇవ్వగలరా? కొత్త పనులు ప్రారంభించాలా? వద్దా? ఏ పనులు రద్దు చేస్తారో మీరే చెప్పండి’ అని పలువురు జడ్పీటీసీ సభ్యులు పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఛైర్‌పర్సన్‌ అరుణమ్మ అధ్యక్షతన స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలందరికీ పాలకవర్గం తరఫున అభినందనలు తెలిపారు. జడ్పీ పాలనా వ్యవహారాల్లో నెల్లూరు రాష్ట్రంలోనే రెండో స్థానం దక్కించుకుందని తెలిపారు. కలువాయి జడ్పీటీసీ సభ్యుడు అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఆగిన పనులు ప్రారంభించాలా? వద్దా? బిల్లుల విషయం మీరు బాధ్యత తీసుకోగలరా? అని పీఆర్‌ ఎస్‌ఈ అశోక్‌కుమార్‌ను అడిగారు. దానికి ఆయన కొత్తవి ఇప్పుడే ప్రారంభించవద్దని, నూతన ఉత్తర్వులను అనుసరించి తెలియజేస్తామని వివరించారు. కలిగిరి జడ్పీటీసీ సభ్యుడు మాల్యాద్రి మాట్లాడుతూ జల్‌జీవన్‌ మిషన్‌ పనులు ప్రారంభించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మర్రిపాడు జడ్పీటీసీ సభ్యుడు మల్లు సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. చింతారెడ్డిపాళెంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇచ్చిన నిధులతో చేపట్టిన అంగన్‌వాడీ భవనం పనులకు సంబంధించిన బిల్లులు ఎందుకు చేయలేదని ఛైర్‌పర్సన్‌ నిలదీశారు. జడ్పీ డిప్యూటీ సీఈవో చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని