logo

సోమశిలపై గత పాలకుల నిర్లక్ష్యం

రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని.. 2021 వరదల సమయంలో పూర్తిగా దెబ్బతిన్న సోమశిల ఆఫ్రాన్‌కు తక్షణం మరమ్మతులు చేయించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ కోరారు.

Updated : 29 Jun 2024 03:05 IST

ఆఫ్రాన్‌ను పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు

అనంతసాగరం, నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని.. 2021 వరదల సమయంలో పూర్తిగా దెబ్బతిన్న సోమశిల ఆఫ్రాన్‌కు తక్షణం మరమ్మతులు చేయించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ కోరారు. శుక్రవారం సంఘం నాయకులతో కలిసి ఆయన జలాశయం, ఆఫ్రాన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరద ఉద్ధృతితో ఆఫ్రాన్, డైవర్షన్‌ వాల్‌ దెబ్బతిని మూడేళ్లు గడుస్తున్నా గత వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. పది లక్షల ఎకరాల ఆయకట్టు, నెల్లూరు, చిత్తూరు, చెన్నై ప్రాంతాలకు తాగు, సాగునీరందించే జలాశయం మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వరదల కాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో తక్షణం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టు ఎస్‌ఈని సంప్రదిస్తే గుత్తేదారుకు బకాయిలు చెల్లించామని, మరో 20 రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని చెప్పారని వెల్లడించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షాన్‌వాజ్, జిల్లా కార్యదర్శి రమణయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమారెడ్డి, సీపీఐ నాయకులు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రాజెక్టు సూపరింటెండెంట్‌ ఇంజినీరుకు వినతిపత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని