logo

ఆగస్టు నాటికి... రైల్వే పనులు పూర్తయ్యేనా?

నెల్లూరు నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకు 30వేల మంది ప్రయాణికులు.. సుమారు వంద రైళ్లు నిలిచే ఈ రద్దీ స్టేషన్‌లో చేపట్టిన ప్రగతి పనులు ఆగస్టు నాటికి పూర్తయ్యేనా అన్న సందేహం కలుగుతోంది.

Published : 29 Jun 2024 02:51 IST

న్యూస్‌టుడే, నెల్లూరు(రైల్వేస్టేషన్‌)

స్టేషన్‌ పడమర వైపు ప్రధాన భవనానికి ఇరువైపులా కొత్త నిర్మాణాలు

నెల్లూరు నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకు 30వేల మంది ప్రయాణికులు.. సుమారు వంద రైళ్లు నిలిచే ఈ రద్దీ స్టేషన్‌లో చేపట్టిన ప్రగతి పనులు ఆగస్టు నాటికి పూర్తయ్యేనా అన్న సందేహం కలుగుతోంది. రైల్వే అధికారుల లెక్కల ప్రకారం.. ఈ ఏడాది మే చివరి నాటికే ఇవి పూర్తి కావాల్సి ఉంది. ఆగస్టు వరకు గడువు పెంచారు. ఇప్పటికి 70 శాతమే పూర్తయ్యాయని.. మరో 30శాతం జరగాల్సి ఉందని తెలుస్తోంది.

రూ.102 కోట్లతో..

విజయవాడ డివిజన్‌ పరిధిలో అత్యధిక ప్రయాణికులతో రాకపోకలు సాగించే నెల్లూరు రైల్వేస్టేషన్‌ను రూ. 102 కోట్లతో ప్రపంచస్థాయి వసతులతో ఆధునికీకరించాలని నిర్ణయించారు. 2024, మే నాటికి పూర్తి చేయాలని నిర్ణయించగా.. ఇప్పటి వరకు ప్రభుత్వ రైల్వే భవనం పూర్తిస్థాయిలో నిర్మించారు. మొదటి నుంచి నాలుగో ఫ్లాట్‌ఫారం వరకు నిర్మించనున్న అండర్‌ బ్రిడ్జి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రెండు, మూడు ఫ్లాట్‌ఫారాల్లో జరుగుతున్న పనులు ఇంకా కొలిక్కిరాలేదు. ఒకటో నంబరు ఫ్లాట్‌ఫారంలో స్టేషన్‌మాస్టర్, సూపరింటెండెంట్‌ కార్యాలయాలు కడుతున్నారు. తూర్పు, పడమర వైపున్న భవనాలతో పాటు అదనంగా కొత్తవి నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఎయిర్‌ కాంకర్స్‌ పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే వ్యాపార సంస్థలు వెలిసే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేస్తే.. ఇబ్బందులు తొలగుతాయని ప్రయాణికులు కోరుతున్నారు. దీనిపై ‘న్యూస్‌టుడే’ సంబంధిత అధికారులను సంప్రదించగా.. పనులు వేగంగా జరుగుతున్నాయని, నిర్దేశిత లక్ష్యంలోపు పూర్తవుతాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని