logo

ఈవీఎం గోదాం పరిశీలన

కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ శుక్రవారం నెల్లూరు ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోదామును రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

Published : 29 Jun 2024 02:48 IST

పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

నెల్లూరు (కలెక్టరేట్‌): కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ శుక్రవారం నెల్లూరు ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోదామును రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలకు ఉపయోగించిన వీవీ ప్యాట్‌ యంత్రాల్లో మిగిలి ఉన్న పేపర్‌ రోల్స్‌ను తొలగించి, యథావిధిగా భద్రపరిచే ప్రక్రియను రెవెన్యూ అధికారులు చేపట్టారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ పద్మావతి, ఆర్డీవో మలోల, తెదేపా, వైకాపా, భాజపా, కాంగ్రెస్, ఆప్‌ పార్టీల ప్రతినిధులు రసూల్, విజయ్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాస్, బాలసుధాకర్, ధరణికుమార్, ఎం.శ్రీనివాసులు పాల్గొన్నారు.


వేళ్లూనుకున్న నిర్లక్ష్యం

ఈనాడు, నెల్లూరు

నెల్లూరు పాత మున్సిపల్‌ ఆఫీస్‌లో భవనం ఖాళీగా ఉండటంతో ఇక్కడ సచివాలయాలు కొనసాగుతున్నాయి. భవనం గోడల్లోకి చెట్ల వేర్లు చొచ్చుకొనిపోయాయి. అసలే పాతగోడలు.. దీనికి తోడు మొక్కలు పెరగడం.. వర్షాకాలం వస్తుండటంతో సిబ్బంది భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. సమస్యపై సచివాలయ ఉద్యోగుల వివరణ కోరగా నగరపాలక అధికారుల దృష్టికి తీసుకెళ్లి మొక్కలను తొలగిస్తామని తెలిపారు.


వానొస్తే వణుకే!

ఈనాడు, నెల్లూరు

ఇది నెల్లూరు స్వర్ణాల చెరువు నుంచి నీలగిరి సంఘం మీదుగా వెళుతున్న పంట కాలువ. నగరంలో మురుగు కాలువల నిర్వహణ సరిగా లేదనడానికి ఈ కాలువే సాక్ష్యం. చిన్నపాటి వర్షం వచ్చినా కాలువలు పొంగి మురుగు రహదారులపై చేరుతోంది. వర్షాలకు ముందే అధికారులు పూడిక తీయిస్తే ముంపు సమస్య ఉండదని నగరవాసులు తెలిపారు. సమస్యపై నగరపాలక సంస్ద్థ ఆరోగ్యాధికారి డాక్టర్‌ వెంకటరమణ మాట్లాడుతూ కాలువల్లో పూడిక తీయిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని