logo

స్వామి భక్తి..

ప్రభుత్వం మారినా అధికారుల్లో స్వామి భక్తి తగ్గడం లేదనడానికి నిదర్శనం ఈ చిత్రం. గత వైకాపా ప్రభుత్వంలో పౌరసరఫరాల బియ్యం పంపిణీకి ఏర్పాటు చేసి ఎండీయూ వాహనం మీద నవరత్నాల చిహ్నం వేశారు.

Published : 29 Jun 2024 02:30 IST

ఈనాడు, నెల్లూరు

ప్రభుత్వం మారినా అధికారుల్లో స్వామి భక్తి తగ్గడం లేదనడానికి నిదర్శనం ఈ చిత్రం. గత వైకాపా ప్రభుత్వంలో పౌరసరఫరాల బియ్యం పంపిణీకి ఏర్పాటు చేసి ఎండీయూ వాహనం మీద నవరత్నాల చిహ్నం వేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగా.. ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాల మీద జగన్‌ చిత్రాలు తొలగించాలని ఆదేశాలు ఉన్నా.. నెల్లూరు నగరంలో అధికారులు పట్టించుకోలేదు. వాహనాల మీద జగన్‌ చిత్రం చెరిపేయాలని తెదేపా నాయకులు కోరుతున్నారు.


ఫైబర్‌ నెట్‌ కేబుళ్లు వృథా

నెల్లూరు పాత మున్సిపల్‌ ఆఫీస్‌ ప్రాంగణంలో మూలన పడిఉన్న ఈ కేబుళ్లు ఏపీ ఫైబర్‌నెట్‌ కోసం కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. నగరవాసులకు ఇంటర్‌నెట్, 330 ప్లస్‌ టీవీ ఛానల్స్, టెలీఫోన్‌ అన్నీ కలిపి అతి తక్కువ ధరకే ప్రజలకు అందించేందుకు తెదేపా ప్రభుత్వం 2015 అక్టోబర్‌లో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దీన్ని పట్ట¨ంచుకోకపోవడంతో ప్రజాధనం వృథాఅయి... కేబుళ్లు ఇలా ఎండకి.. వానకి పాడైపోతున్నాయి.

ఈనాడు, నెల్లూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని