logo

అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ పట్టివేత

ఇసుక మాఫియాపై కోవూరు పోలీసులు కొరడా ఝులిపించారు. వరుసగా రెండు రోజులు తనిఖీలు చేసిన ఇసుక ట్రాక్టర్, టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Updated : 05 Jul 2024 15:45 IST

కోవూరు: ఇసుక మాఫియాపై కోవూరు పోలీసులు కొరడా ఝులిపించారు. వరుసగా రెండు రోజులు తనిఖీలు చేసిన ఇసుక ట్రాక్టర్, టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని పెన్నా పరివాహక ప్రాంతం నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న కోవూరు ఎస్సై రంగనాథ్‌ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఇనుముడు సెంటర్‌ వద్ద ఇసుక టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్ట పరంగా చర్యలు తప్పవని ఎస్సై రంగనాథ్ గౌడ్ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని