logo

Nalgonda: సేవలు శాశ్వతం: కలెక్టర్

ప్రజాప్రతినిధుల కాల పరిమితి ఐదేళ్లయినప్పటికీ వారు అందించే సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కలెక్టర్ హనుమంతు కే జండగే అన్నారు.

Published : 02 Jul 2024 17:40 IST

భువనగిరి: ప్రజాప్రతినిధుల కాల పరిమితి ఐదేళ్లయినప్పటికీ వారు అందించే సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కలెక్టర్ హనుమంతు కే జండగే అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలకు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ ఛైర్మన్‌తో పాటు ఎంపీపీలు, జడ్పీ సభ్యులను సన్మానించి జ్ఞాపికలను బహుకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తమ పదవీకాలంలో సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో జిల్లా అభివృద్ధికి సహకరించిన ఎంపీపీలు, జడ్పీటీసీలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జడ్పీ వైస్ ఛైర్మన్ బీకు నాయక్, జడ్పీ సీఈవో శోభారాణి, జడ్పీటీసీలు నరేందర్, డాక్టర్ నగేష్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని