logo

Politics: శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

దేశవ్యాప్తంగా భారతీయ జన సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్‌ నిర్వహించారు.

Published : 01 Jul 2024 17:14 IST

భువనగిరి: దేశవ్యాప్తంగా భారతీయ జన సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్‌ నిర్వహించారు. ఈ మేరకు భాజపా జూన్ 23 నుంచి జులై 6 వరకు జయంతి వేడుకలు నిర్వహించనుంది. శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్ దివాస్ పక్షోత్సవాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా  సోమవారం శ్యాంప్రసాద్ ముఖర్జీ చరిత్రపై భాజపా జిల్లా పార్టీ సెమినార్ జరిపింది. ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ రాచకొండ కృష్ణ అధ్యక్షత వహించారు. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు  పేరాల చంద్రశేఖర రావు మాట్లాడుతూ.. శ్యాం ప్రసాద్ ముఖర్జీ నాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆధ్యుడని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జన్నం పల్లి శ్యాంసుందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతంశెట్టి రవీందర్, దాసరి మల్లేశం, గూడూరు నారాయణరెడ్డి, పడాల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు చందా మహేందర్ గుప్తా, వివిధ మోర్చా అధ్యక్షులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని