logo

ఉచితానికి పచ్చజెండా..!

కరెంటు కోసం ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గత ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉచిత విద్యుత్తు వ్యవసాయ బోరుబావుల దరఖాస్తులకు పచ్చజెండా ఊపింది.

Published : 04 Jul 2024 05:05 IST

జిల్లాలో 10 వేల మంది రైతులకు లబ్ధి

నల్గొండ జిల్లాపరిషత్తు, న్యూస్‌టుడే: కరెంటు కోసం ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గత ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉచిత విద్యుత్తు వ్యవసాయ బోరుబావుల దరఖాస్తులకు పచ్చజెండా ఊపింది. దీంతో నల్గొండ జిల్లాలో పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు మోక్షం లభించనుంది.గత రెండేళ్లుగా నల్గొండ జిల్లాలో అనావృష్టి తాండవం చేస్తోంది. నీటి కొరత కారణంగా పంటలకు నీరు అందక ఎండిపోయాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు ఎక్కువ సంఖ్యలో బోర్లు తవ్వించారు. జిల్లాను పరిశీలిస్తే అధికంగా సాగర్‌ ఎడమ కాల్వ పరిధిలోని మండలాల్లో సుమారు ఏడు వేలకు పైగా కొత్త బోర్లు తవ్వించినట్లు సమాచారం. భూగర్భ జలాలపై ఆధారపడి సాగు చేసుకుంటున్న మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో సైతం ఈ ఏడాది రైతులు పెద్ద మొత్తంలో బోర్లు తవ్వారు. ఆ బోరుబావుల కింద పంటలు సాగు చేయాలంటే కరెంటు కీలకంగా మారడంతో ప్రభుత్వం నిర్ధేశించిన పైకంతో కూడిన డీడీలను జత చేస్తూ రైతులు ఉచిత కరెంటు వ్యవసాయ బోర్ల సర్వీసుల కోసం దరఖాస్తులు చేశారు. అవి గత ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి.

10 వేల దరఖాస్తులకు గ్రీన్‌సిగ్నల్‌..

దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ నల్గొండ సర్కిల్‌ పరిధిలో గత ఏడాది కాలంగా 11706 మంది రైతులు ఉచిత విద్యుత్తు వ్యవసాయ బోరుబావుల సర్వీసుల కోసం దరఖాస్తు చేశారు. అందులో 1700 మంది రైతులు ఓఆర్‌సీˆ చెల్లించాల్సి ఉంది. మిగతా 10 వేల మంది రైతులకు వెంటనే కరెంటు కనెక్షన్లు విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యుత్తుశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.

మూడు నెలల్లో పూర్తి

చంద్రమోహన్, ఎస్‌ఈ

పెండింగ్‌లో ఉన్న ఉచిత వ్యవసాయ దరఖాస్తులను పరిష్కరించి సర్వీసులు విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు డివిజన్ల వారీగా కసరత్తు చేపట్టాం. మూడు నెలల్లో 10 వేల సర్వీసులను విడుదల చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని