logo

మక్త అనంతారం ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు

ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రంలోనే స్వచ్ఛతకు కేరాఫ్‌గా నిలిచిన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం మక్త అనంతారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు రాష్ట్రంలో మరో ప్రత్యేక గుర్తింపు దక్కింది.

Updated : 04 Jul 2024 06:05 IST

ఎస్‌సీఈఆర్‌టీ ఇటీవల విడుదల చేసిన పుస్తకం

బీబీనగర్, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రంలోనే స్వచ్ఛతకు కేరాఫ్‌గా నిలిచిన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం మక్త అనంతారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు రాష్ట్రంలో మరో ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఎస్‌సీఈఆర్‌టీ (స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యూకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ తెలంగాణ) ఇటీవల ‘స్కూల్‌ లీడర్‌షిప్‌ అకాడమీ’ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిన పలు పాఠశాలల వివరాలతో స్ఫూర్తిదాయక పాఠశాలల వివరాలతో ‘హర్బింగర్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌’ అనే పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పుస్తకంలో ‘నాయకత్వ లక్షణాలతో స్వచ్ఛ ప్రగతి సాధన బాట’ లో అనే టైటిల్‌తో మక్త అనంతారం పాఠశాలలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్వీ రామరాజు విద్యార్థులు తోటి ఉపాధ్యాయులతో కలిసి సమష్టిగా సాధించిన ప్రగతి, స్వచ్ఛత వివరాలు నాలుగు పేజీల్లో (పుస్తకంలోని 301 నుంచి 304 పేజీలలో) వివరించారు. రెండు సార్లు రాష్ట్ర స్థాయి స్వచ్ఛ పురస్కారాలు అందుకున్న మక్త అనంతారం ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రస్తుతం ఎస్‌సీఈఆర్‌టీలో చోటు దక్కడంపై జడ్పీటీసీ సభ్యురాలు గోలి ప్రణీత, ఎంపీపీ ఎరుకల సుధాకర్‌గౌడ్, మండల ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. అందుకు కృషిచేసిన ప్రధానోపాధ్యాయుడు ఎస్వీ రామరాజును అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని