logo

యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆరాధనలు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో బుధవారం మూలవరులను ఆరాధిస్తూ చేపట్టిన ఆస్థాన, ఆర్జిత పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. గర్భాలయ ద్వారాలను తెరిచిన పూజారులు హారతితో కొలిచారు.

Published : 04 Jul 2024 04:15 IST

శ్రీస్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణం

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో బుధవారం మూలవరులను ఆరాధిస్తూ చేపట్టిన ఆస్థాన, ఆర్జిత పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. గర్భాలయ ద్వారాలను తెరిచిన పూజారులు హారతితో కొలిచారు. పాలతో నిజాభిషేకం నిర్వహించాక, తులసీ పత్రాలతో అర్చన చేపట్టారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి స్వర్ణమూర్తులకు స్వర్ణ పుష్పార్చన జరిపారు. ఆలయ మహాముఖ మండపంలో యజ్ఞమూర్తులను కొలుస్తూ సువర్ణ పుష్పార్చన కొనసాగించారు. అనంతరం శ్రీ సుదర్శన హోమం నిర్వహించారు. లోక కల్యాణార్థమై నారసింహుడు శ్రీ లక్ష్మీసమేతుడయ్యే తతంగాన్ని నిత్యకల్యాణోత్సవం ద్వారా చేపట్టారు. కల్యాణ మూర్తులను గజవాహనంపై అలంకృతులను చేసి సేవా పర్వాన్ని నిర్వహించారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలను మంగళ వాయిద్యాలు, మంత్ర పఠనంతో మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి గర్భాలయంలోని స్వయంభువులను కొలుస్తూ ప్రత్యేక ఆరాధన జరిపారు. దర్బార్‌ సేవోత్సవంలో నిత్యాదాయాన్ని వెల్లడించారు. వివిధ విభాగాల ద్వారా రూ.18,82,227 ఆదాయం చేకూరింది. అనుబంధంగా కొనసాగుతున్న శివాలయంలో నిత్యపూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి.

యాదాద్రీశుడి సేవలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి

యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి బుధవారం సందర్శించారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఎమ్మెల్సీకి ఆలయ ఈవో భాస్కరరావు స్వాగతం పలికి దేవుడి ప్రసాదాన్ని అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని