logo

యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన

ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో విశేష ఆరాధనలు నిర్వహించారు.

Published : 03 Jul 2024 04:12 IST

మంగళవారం సాయంత్రం నిర్వహించిన అలంకార సేవోత్సవం

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో విశేష ఆరాధనలు నిర్వహించారు. గర్భాలయంలో మూలవరులను కొలుస్తూ పంచామృతంతో అభిషేకం చేపట్టిన పూజారులు తులసీ దళాలతో అర్చన నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనమూర్తులకు సువర్ణ పుష్పార్చన జరిపారు. ఆలయ మహాముఖ మండపంలో యజ్ఞమూర్తులను ఆరాధిస్తూ ఏకాదశి వేడుకగా లక్ష పుష్పాలతో ప్రత్యేక అర్చన చేపట్టారు. వేద, మంత్ర పఠనంతో గంటన్నర పాటు కొనసాగిన ప్రత్యేక అర్చనలో పలువురు భక్తులు, ఆలయ ఈవో భాస్కర్‌రావు పాల్గొని ఆశీస్సులు పొందారు. నిత్యారాధనలో భాగంగా అష్టభుజి మండప ప్రాకారంలో శ్రీసుదర్శన నారసింహహోమం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం నిర్వహించి, కల్యాణమూర్తులను గజవాహనంపై అలంకృతులను చేసి సేవా పర్వాన్ని చేపట్టారు. సాయంత్రం అలంకార సేవలను మంగళ వాయిద్యాల మధ్య నిర్వహించారు. రాత్రి స్వయంభువులను కొలుస్తూ ప్రత్యేక ఆరాధన, సహస్రనామార్చన నిర్వహించారు. దర్బారు సేవోత్సవంలో నిత్యాదాయాన్ని వెల్లడించారు. వివిధ విభాగాల ద్వారా రూ.19,21,613 ఆదాయం చేకూరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని