logo

అమ్మకు గుర్తుగా మొక్క..!

కనకనలాడే ఎండకు శిరస్సు మాడినా.. మనకు తన నీడను అందించే చెట్టే అమ్మాజారెడు నీళ్లయిన తాను దాచుకోక... జగతికి సర్వస్వం అర్పించే మబ్బె అమ్మ ఆ అమ్మలనే మించిన మా అమ్మకు... రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ.. కంటేనే అమ్మ అంటే ఎలా... కరుణించే ప్రతి దేవత అమ్మే కదా... కన్న అమ్మే కదా..

Updated : 03 Jul 2024 05:42 IST

కనకనలాడే ఎండకు శిరస్సు మాడినా.. మనకు తన నీడను అందించే చెట్టే అమ్మాజారెడు నీళ్లయిన తాను దాచుకోక... జగతికి సర్వస్వం అర్పించే మబ్బె అమ్మ ఆ అమ్మలనే మించిన మా అమ్మకు... రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ.. కంటేనే అమ్మ అంటే ఎలా... కరుణించే ప్రతి దేవత అమ్మే కదా... కన్న అమ్మే కదా..

సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్‌టుడే: మాతృమూర్తులు తమ పిల్లలను ఎలా సంరక్షించుకుంటారో.. అలాగే ఒక చెట్టు కూడా పర్యావరణాన్ని అలా రక్షిస్తోంది.. ఇలా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తమ తల్లుల పేరిట ఒక మొక్కను నాటాలని ఇటీవల మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు సూచించారు. తల్లులు చనిపోయిన వారు వారి ఫొటోలను తీసుకుని వెళ్లి మొక్కలు నాటాలని.. ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని పేర్కొన్నారు. ప్రధాని పిలుపుతో ఆ దిశగా అధికార యంత్రాంగం అడుగులు వేస్తోంది. కాగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించి.. ఉద్యమంలా చేపడుతోంది.

అటవీ విస్తీర్ణం పెంపునకు దోహదం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటవీ విస్తీర్ణం తీవ్రంగా వెనుకబడింది. ప్రస్తుత కాలంలో చెట్లను నరికివేస్తుండటంతో కాలుష్యం ప్రభావం పెరుగుతూ వస్తోంది. దీంతో వాతావరణంలో కాలుష్య సమతుల్యత తగ్గిపోతుంది. ఈ ప్రభావం భవిష్యత్తు తరాలపై తీవ్రంగా చూపే అవకాశం ఉండటంతో దీని నుంచి మేల్కొనేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా గత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని.. ప్రస్తుత ప్రభుత్వం పేరు మార్చి వన మహోత్సవం పేరిట చేపడుతోంది. గతంలో ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో, రహదారుల వెంట మొక్కలు నాటడంతో అటవీ విస్తీర్ణం కొంత వరకు పెరిగింది. ప్రస్తుతం వానాకాలం రావటంతో ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని ప్రధాని మోదీ అధికారులకు, ప్రజలకు సూచించారు.

నాటిన మొక్కను సంరక్షిస్తేనే ప్రతిఫలం

సృష్టిలో తల్లులు తమ పిల్లలను ఎంత ప్రేమగా కాపాడుకుంటారో.. అదే రీతిలో నాటిన మొక్కనూ సంరక్షిస్తేనే అనుకున్న ప్రతిఫలం చేకూరుతుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఇంటి ఆవరణలో ఒక మొక్కను నాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది జనాభా ఉండగా..వీరందరు తల ఒక్కోటి నాటినా అన్ని లక్షల మొక్కలు నాటే వీలుంటుంది. వాటిని సంరక్షిస్తే ఉమ్మడి జిల్లాలో భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేకూరుతుంది. అందరూ ఆలోచించి ఈ వన మహోత్సవంలో భాగస్వాములై, విజయవంతంగా చేపట్టాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఆ దిశగా నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తుండగా అవసరం ఉన్న మొక్కలను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని