logo

నకిలీ ధ్రువపత్రాలతో.. నర్సుల కొలువులు..?

వైద్యఆరోగ్యశాఖ పరిధిలో రెండు నెలల క్రితం ఒప్పంద, పొరుగు సేవల కింద స్టాఫ్‌నర్సులు(20) ఫార్మాసిస్టులు(2), ఆయూష్‌ ఫార్మాసిస్టు(4) కొలువుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించారు.

Published : 03 Jul 2024 03:34 IST

నల్గొండ అర్బన్, న్యూస్‌టుడే: వైద్యఆరోగ్యశాఖ పరిధిలో రెండు నెలల క్రితం ఒప్పంద, పొరుగు సేవల కింద స్టాఫ్‌నర్సులు(20) ఫార్మాసిస్టులు(2), ఆయూష్‌ ఫార్మాసిస్టు(4) కొలువుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించారు. నాలుగు వేల వరకు నిరుద్యోగ అభ్యర్థులు ఈ కొలువులకు దరఖాస్తులు చేసుకున్నారు. స్టాఫ్‌నర్సుల ఎంపికకు మే నెలలో మెరిట్‌ అభ్యర్థులను ఎంపిక చేసి డీఎంహెచ్‌వో కార్యాలయం గోడపై వివరాలు పొందు పరిచారు. ఎంపిక చేసిన మొదటి పది మందిలో ఐదుగురు ఏడాది క్రితం జరిగిన ఎంపికలో దరఖాస్తులు చేసుకున్న వారే ఉన్నారు. అప్పట్లో వారి పేర్లు రెండు వందల సంఖ్యకు దిగువన ఉండగా.. మే నెలలో జరిగిన ఎంపిక జాబితాలో  పదిలోపు ఉండటంతో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల్లో కొందరు అప్పటి డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. కంప్యూటర్‌లో తప్పులు దొర్లాయని చెబుతూ.. ఎన్నికల నియమావళి, డీఎంహెచ్‌వో పదవీ విరమణ వంటి కారణాలతో అభ్యర్థుల ఎంపిక తాత్కాలికంగా వాయిదా వేశారు. తాజాగా అభ్యర్థుల మెరిట్‌ లిస్టును జూన్‌ 29న మరోసారి ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో కల్యాణ్‌ చక్రవర్తి ప్రకటించారు. ఇందులో సైతం గతంలో తప్పులు చోటు చేసుకున్నాయి.గత అభ్యర్థుల పేర్లు అదేస్థానంలో ఉంచడంతో పాటు మరో ఇద్దరు అభ్యర్థులకు ఎక్కువ మార్కులు ఉన్నట్లు చూపారు. జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నవారితో పాటు రూ.2.50 లక్షలు చెల్లించిన వారికి నర్సులు, ఫార్మాసిస్టులు, ఆయూష్‌ ఫార్మాసిస్టుల కొలువుల్లో  అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. గతంలో అనుభవం ఉన్నట్లు ధ్రువపత్రాలు సృష్టించి దరఖాస్తులు చేయించినట్లు సమాచారం. మరో వారం రోజుల్లో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరగనున్న కమిటీ ద్వారా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయనున్నారు.

క్రిమినల్‌ కేసులు పెడతాం

డా.కల్యాణ్‌ చక్రవర్తి, ఇన్‌ఛార్జి డీంఎంహెచ్‌వో

అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉంటుంది. స్టాఫ్‌నర్సులు, ఫార్మాసిస్టులు, ఆయూష్‌ ఫార్మాసిస్టుల ఎంపికలో తప్పుడు పత్రాలు చూపిన వారిపై క్రిమినల్‌ కేసులు పెడతాము. కలెక్టర్‌ ఎంపిక చేసిన కమిటీ ద్వారా మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ముందు వరసలో ఉన్నవారి నిజ ధ్రువపత్రాలు పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాతే ప్రక్రియ ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని