logo

సత్వర న్యాయమే లక్ష్యం

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పురోగతిని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత అధినియం - 2023 కొత్త చట్టంతో భారత న్యాయవ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి.

Updated : 03 Jul 2024 05:41 IST

ఆలేరు, న్యూస్‌టుడే: ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పురోగతిని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత అధినియం - 2023 కొత్త చట్టంతో భారత న్యాయవ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్త చట్టాల అమలు ఎలక్ట్రానిక్‌ మాధ్యమంలోనే అమలు జరగనున్నాయి. ప్రజలు వీటిపై  అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం పోలీసుశాఖ విస్తృతంగా ప్రచారం చేపట్టింది. బాధితులు ఇక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్టాన్రిక్‌ మాధ్యమంలోనే ఫిర్యాదు చేయవచ్చు. జీరో ఎఫ్‌ఐఆర్‌కు అవకాశం, రహదారి ప్రమాదాలకు కారకులై పారిపోయే వారిపై నాన్‌బెయిల్‌ కేసు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి శిక్షా కాలం పెంపు, చైన్‌ స్నాచింగ్‌పై కొత్త సెక్షన్‌.. ఇలా భారత ప్రభుత్వం ఈ నెల 1 నుంచి అమలులోకి తీసుకువచ్చిన నూతన నేర న్యాయ చట్టాల్లో పలు అంశాలు ఉన్నాయి.

త్వరితగతిన తీర్పులకు అవకాశం

జూకంటి రవీందర్, అధ్యక్షుడు, బార్‌ అసోసియేషన్, ఆలేరు
కొత్త చట్టాలతో ప్రజలకు త్వరితగతిన న్యాయం జరిగే అవకాశం ఉంది. మారుతున్న నేరాల తీరు, వ్యవస్థలకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. భారతీయ సంస్కృతి, విధానాలకు అనుగుణంగా చట్టాలలో మార్పులు తీసుకువచ్చారు. విస్తృతంగా ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని