logo

నమ్మించి నట్టేట్లో ముంచి..!

చిట్టీలు, వడ్డీల పేరిట ఓ వ్యక్తి పలువురిని నమ్మించి రూ.కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఘటన హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

Published : 02 Jul 2024 05:42 IST

రూ. 23.32 కోట్ల వసూలు చేసి ఉడాయించిన వైనం

హయత్‌నగర్, న్యూస్‌టుడే: చిట్టీలు, వడ్డీల పేరిట ఓ వ్యక్తి పలువురిని నమ్మించి రూ.కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఘటన హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన చిట్టెటి మధుసూదన్‌రెడ్డి కుటుంబంతో కొన్నేళ్లుగా హయత్‌నగర్‌ రాజరాజేశ్వరి కాలనీలో ఉంటున్నాడు. ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో సదరు కళాశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పడిన పరిచయాలను ఆసరాగా చేసుకొని చిట్టీలు, వడ్డీ వ్యాపారం ప్రారంభించాడు. స్వగ్రామంలో 100 ఎకరాల మామిడి తోట, హయత్‌నగర్‌లో సొంతిళ్లు, ప్లాట్లు ఉన్నాయంటూ నమ్మించాడు. దాదాపుగా 137 మంది నుంచి రూ.23.32 కోట్ల మేరకు డబ్బు తీసుకొని కొద్ది రోజులుగా ముఖం చాటేశాడు. దిక్కుతోచని స్థితిలో పలువురు బాధితులు ఆదివారం రాత్రి హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హయత్‌నగర్‌ సీఐ రామకృష్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని