logo

చరవాణితో.. జర భద్రం

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం.. ఖరీదైన చేతి గడియారం దర్పానికి ప్రతీక.. ఇప్పుడు ఆ స్థానాన్ని చరవాణి ఆక్రమించింది. ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌.. పేరున్న బ్రాండ్‌.. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇదే.

Published : 01 Jul 2024 04:14 IST

ఇటీవల నల్గొండ జిల్లా పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రజాప్రతినిధులు వెల్లడించే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అధికారులు చరవాణిలో  నిమగ్నమయ్యారు. సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో జరిగిన జిల్లా సమావేశంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి తీవ్ర విమర్శలకు దారి తీసింది. మునుగోడు మండలం కొరటికల్‌లో చరవాణిలో ఎక్కువ సమయం గడుపుతున్న కుమారుడిని తండ్రి మందలించడంతో శుక్రవారం ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

నాంపల్లి, న్యూస్‌టుడే: ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం.. ఖరీదైన చేతి గడియారం దర్పానికి ప్రతీక.. ఇప్పుడు ఆ స్థానాన్ని చరవాణి ఆక్రమించింది. ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌.. పేరున్న బ్రాండ్‌.. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇదే. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ చరవాణి తప్పనిసరిగా మారింది. మంచి, చెడులు సమ్మిళితమై ఉన్న ఈ యంత్రాన్ని మనం దేనికి ఉపయోగిస్తే అలా తయారవుతాం అంటున్నారు నిపుణులు. కొందరు ఏకంగా రెండు, మూడు చరవాణులు వాడేస్తున్నారని, ఇది వ్యసనంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల ప్రతి ఒక్కరూ నిద్ర లేవగానే చరవాణి చూడటంతో దినచర్య ప్రారంభిస్తున్నారు. రాత్రి 11-12 గంటల వరకు ఇదే నేస్తం. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించేటప్పుడు నిరంతరాయంగా చరవాణితోనే గడుపుతున్నారు.

నిద్రలేమి సమస్య..

రోజువారి విధులు, పాఠశాల, కళాశాల.. ఇతర ప్రాంతాల్లో ఎవరిని చూసినా రోజంతా చరవాణితో కనిపిస్తున్నారు. గతంలో సమాచార సేకరణ, సంభాషణకు ఉన్న చరవాణి నేడు సామాజిక మాధ్యమాల్లో గడిపేందుకు మొగ్గు చూపేలా చేస్తోంది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్, ఎక్స్‌ (ట్విట్టర్‌)లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వాటిలో వీడియోలు, చిత్రాలు పోస్టు చేసి, ఎంతమంది వీక్షించారు, కామెంట్లు పెట్టారు, లైకులు కొట్టారు అంటూ తరచూ చూస్తున్నారు. నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు.

మానసిక ఒత్తిడి..

అంతర్జాలం, చరవాణి నిద్రను దూరం చేస్తున్నాయని ఇటలీ, అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా ప్రకటించాయి. రాత్రంతా చరవాణిపై శ్రద్ధ పెట్టి ఉదయాన్నే లేవాల్సి రావడంతో రోజంతా చురుకుదనం లోపిస్తుందని, ఇది ఇలాగే కొనసాగితే సమస్యలు తప్పవని స్పష్టం చేసింది. మనిషికి కనీసం 8 గంటల నిద్ర అవసరమని తెలియజేసింది.

ఇబ్బందులు ఇలా..

  • మితిమీరిన చరవాణి వినియోగం నిద్రలేమిని తెచ్చి పెడుతుంది.
  • రేడియేషన్‌ కారణంగా కంటి, మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
  • జ్ఞాపకశక్తి లోపించడంతో పాటు కుంగుబాటుకు గురవుతారు.
  • కళ్లపై ఎక్కువ భారం పడి ఒత్తిడికి గురవుతారు.
  • రెటినా దెబ్బతిని శుక్లాల సమస్య ఏర్పడుతుంది.
  • దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు దారి తీస్తుంది.

జిల్లాలోని 100 మందిని చరవాణి వినియోగం గురించి ప్రశ్నించగా.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని