logo

నేటి నుంచి పన్నులపై వడ్డీంపు

పురపాలికల్లో పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. 2024-25 సంవత్సరాన్ని రెండు విడతలుగా విభజించి పన్నులు వసూలు చేస్తున్నారు.

Updated : 01 Jul 2024 05:58 IST

సూర్యాపేటలో పన్నుదారులకు డిమాండ్‌ నోటీసులు అందజేస్తున్న పుర అధికారులు

సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే: పురపాలికల్లో పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. 2024-25 సంవత్సరాన్ని రెండు విడతలుగా విభజించి పన్నులు వసూలు చేస్తున్నారు. మొదటి అర్ధ సంవత్సరం జూన్‌ 30తో ముగిసింది. ఇప్పటి వరకు పన్నులు చెల్లించిన వారికి ఎటువంటి వడ్డీ పడలేదు. ఇన్నాళ్లు చెల్లించని వారికి ఇప్పటికే పుర అధికారులు డిమాండ్‌ నోటీసులు పంపించారు.

2 శాతం వడ్డీ భారం

రెండో అర్ధ సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ మధ్యకాలంలో పన్నులు చెల్లించేవారికి 2 శాతం వడ్డీ భారం పడనుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 19 పురపాలికల్లో ఈ నెల 1 నుంచి డిసెంబరు 31 వరకు పన్నుదారులు 2 శాతం వడ్డీతో పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి నంబరు, అసెస్‌మెంటు నంబర్‌ ఆధారంగా పుర కార్యాలయాల్లోని బిల్‌ కలెక్టర్ల వద్ద లేదంటే ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. వడ్డీ విధింపుతో పురపాలికలకు ఆదాయం సమకూరటంతోపాటు పన్నుదారులకు భారంగా మారనుంది.

పురపాలికల అభివృద్ధికి సహకరించాలి

శ్రీనివాస్, పుర కమిషనర్, సూర్యాపేట

జూన్‌ 30తో మొదటి అర్ధ వార్షిక సంవత్సరం ముగిసింది. ఈ నెల 1 నుంచి డిసెంబరు 31 వరకు 2 శాతం వడ్డీ పడుతుంది. గృహ యజమానులు స్పందించి తమ పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు