logo

చెప్పిందే ధర..!

సూర్యాపేట కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు చెప్పిన ధరకే వినియోగదారులు కొనాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు నిర్ణయించిన ధరకు విక్రయించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

Published : 01 Jul 2024 04:02 IST

‘పేట’ కూరగాయల మార్కెట్‌లో అమలు కాని వెలల పట్టిక

సూర్యాపేట: కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు

భానుపురి, న్యూస్‌టుడే: సూర్యాపేట కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు చెప్పిన ధరకే వినియోగదారులు కొనాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు నిర్ణయించిన ధరకు విక్రయించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. రైతుబజారులో ఏర్పాటు చేసిన ధరల పట్టిక ప్రకారం అమ్మాల్సి ఉండగా.. వ్యాపారులు మాత్రం పెంచి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేమని అడిగితే కూరగాయల కొరత ఉందని, ధరలు పెరిగాయని సాకులు చెబుతున్నారు.

పట్టికకే పరిమితం

సూర్యాపేట కూరగాయల మార్కెట్‌లో ఎస్టేట్‌ అధికారులు రోజు వారీగా ధరలను నిర్ణయిస్తారు. ఈ వివరాలను రైతుబజారులోని గోడలపై గల పట్టికలో రాస్తారు. వీటి ప్రకారం అందరూ అమ్మకాలు సాగించాలి. వ్యాపారులు పట్టిక కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. బోర్డుపై కిలో టమాట రూ.50 ఉంటే రూ.70 నుంచి రూ.80 వరకు, పచ్చిమిర్చి ధర రూ.60 ఉంటే రూ.100 నుంచి రూ.120కి  విక్రయిస్తున్నారు. అన్నింటికీ ఇదే తంతు సాగుతోంది. రైతులు రైతు బజార్‌లో అమ్మాల్సి ఉండగా.. బయటి వ్యాపారులతో కలిసి వ్యాపారం చేస్తున్నారు. దీంతో వినియోగదారులు నిలువునా మోస పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదు. కనీసం క్షేత్రస్థాయిలో తనిఖీలు జరపడం లేదు.

రోజువారీగా పర్యవేక్షణ చేస్తాం

అరుణిమ, రైతుబజారు ఎస్టేట్‌ అధికారిణి, సూర్యాపేట

కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు ధరల పట్టిక ప్రకారం అమ్మకాలు చేయటం లేదనే విషయం మా దృష్టికి రాలేదు. పరిశీలించి చర్యలు చేపడతాం. రైతులు మార్కెట్‌లో విక్రయాలు జరపొద్దు. ఇక నుంచి రోజువారీగా పర్యవేక్షణ చేస్తాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని