logo

శ్రీస్వామి నిలయంలో దైవారాధనలు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆర్జిత కైంకర్యాలతో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దైవ దర్శనం కోసం బారులు తీరారు.

Published : 01 Jul 2024 03:51 IST

శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి నిత్య కల్యాణ పర్వం

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆర్జిత కైంకర్యాలతో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దైవ దర్శనం కోసం బారులు తీరారు. రద్దీ సాధారణంగా నెలకొంది. వేకువ జామున సుప్రభాతం చేపట్టిన పూజారులు మూలవరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం, నిత్య కల్యాణం, స్వర్ణ పుష్ప ఆరాధన, అలంకార సేవోత్సవాలు ఆలయ ఆచారంగా కొనసాగించారు. గర్భాలయంలో కొలువై ఉన్న స్వయంభువులను స్మరిస్తూ, భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. అనుబంధ ఆలయాలలో నిత్య పూజలు కొనసాగించారు. పాతగుట్ట ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామిని కొలుస్తూ నిజాభిషేకం, తులసీ అర్చన, నిత్య కల్యాణం పాంచరాత్రాగమ శాస్త్రరీత్యా నిర్వహించారు. ఆలయ దేవుడి దర్శనం చేసుకున్న భక్తులు పలువురు కటుంబీకులతో వన భోజనాలు చేశారు.

యాదాద్రీశుడి సేవలో హైకోర్టు జడ్జి

యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రియదర్శిని కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సందర్శించారు. ప్రధాన ఆలయంలో కొలువై ఉన్న పంచనారసింహులను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఆలయ ఈవో భాస్కర్‌రావు న్యాయమూర్తికి స్వాగతం పలికి దేవుడి ప్రసాదం అందజేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని