logo

కొత్త చట్టాలపై అవగాహన అవసరం

న్యాయవాదులు చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జాతీయ న్యాయవాదుల యూనియన్‌(ఐలు) రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ అన్నారు.

Published : 30 Jun 2024 03:25 IST

జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజుకు కొత్త చట్టాల పుస్తకాలను అందజేస్తున్న న్యాయవాది రాపోలు భాస్కర్‌

భువనగిరి గంజ్, న్యూస్‌టుడే: న్యాయవాదులు చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జాతీయ న్యాయవాదుల యూనియన్‌(ఐలు) రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ అన్నారు. కోర్టులో శనివారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వృత్తిపై పట్టు సాధించేందుకు న్యాయవాదులు నిరంతర విద్యార్థిగా మందుకు సాగాలన్నారు. చట్టాలలో జరిగిన కొన్ని మార్పులపై పట్టు సాధించి వృత్తిలో రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా మూడు కొత్త చట్టాల పుస్తకాలను సీనియర్‌ న్యాయవాది రాపోలు భాస్కర్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజుకు అందజేశారు. చట్టాల మార్పులపై సీనియర్‌ న్యాయవాది మహ్మద్‌ అబ్దుల్‌ రహీం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బబ్బూరి హరినాథ్, ఐలు జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కుక్కదూగు సోమయ్య, న్యాయవాదులు నాగారం అంజయ్య, రవీందర్, శ్రీకాంత్, గోద వెంకటేశ్వర్లు, జయ, జగతయ్య, నిహాల్, వెంకటేశం, దాసు, విద్యాసాగర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని