logo

ధరణి పెండింగ్‌ సమస్యలు పరిష్కరిస్తాం: కలెక్టర్‌

ధరణి పెండింగ్‌ సమస్యలు సత్వరమే పరిష్కరిస్తామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి రెవెన్యూశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, సీసీఎల్‌ఏ ఇన్‌ఛార్జి నవీన్‌ మిట్టల్‌కు తెలిపారు.

Published : 30 Jun 2024 03:02 IST

దూర దృశ్య శ్రవణ సమీక్ష సమావేశంలో
కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌

నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: ధరణి పెండింగ్‌ సమస్యలు సత్వరమే పరిష్కరిస్తామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి రెవెన్యూశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, సీసీఎల్‌ఏ ఇన్‌ఛార్జి నవీన్‌ మిట్టల్‌కు తెలిపారు. క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని వివరించారు. నల్గొండ జిల్లా కలెక్టర్‌తో ధరణి సమస్యల పరిష్కారంపై రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దూర దృశ్య శ్రవణ సమీక్ష ద్వారా మాట్లాడారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో మండలాలు, గ్రామాల వారిగా ధరణి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని తెలిపారు. త్వరలోనే జిల్లాలోని అన్ని పెండింగ్‌ సమస్యలు పరిష్కరిస్తామని వివరించారు. దూర దృశ్య శ్రవణ సమీక్ష అనంతరం కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆర్‌డీవోలు, తహసీల్దార్లతో ద్వారా మాట్లాడారు. అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్, ఏవో మోతీలాల్, కలెక్టరేట్‌ రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

మండల స్థాయిలోనే ప్రజావాణి..జులై 8వ తేదీ నుంచి జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చే ఫిర్యాదులు సమర్పించాలనుకునే ఫిర్యాదుదారులు సంబంధిత మండలాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలోనే ఫిర్యాదులు సమర్పించాలని సూచించారు. మండలస్థాయిలో నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని