logo

నూతన చట్టాల రద్దుకు డిమాండ్‌

జులై నుంచి అమలయ్యే నూతన క్రిమినల్‌ చట్టాలను రద్దు చేయాలని ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్‌రెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బబ్బూరి హరినాథ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 29 Jun 2024 03:32 IST

భువనగిరి: బార్‌ అసోసియేషన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు

భువనగిరి గంజ్, న్యూస్‌టుడే: జులై నుంచి అమలయ్యే నూతన క్రిమినల్‌ చట్టాలను రద్దు చేయాలని ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్‌రెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బబ్బూరి హరినాథ్‌ డిమాండ్‌ చేశారు. నూతన చట్టాల అమలును వ్యతిరేకిస్తూ శుక్రవారం బార్‌ అసోసియేషన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గత చట్టాలను మార్చి మూడు చట్టాలను అమలు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాల అమలు అందరికి అనుకూలంగా ఉండాలే తప్ప ఇబ్బందులు పెట్టే విధంగా ఉండొద్దన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు గోద వెంకటేశ్వర్లు, కేశవరెడ్డి, కుమార్, నిసంగి విద్యాసాగర్, రమేష్‌ పాల్గొన్నారు.

రామన్నపేట, న్యూస్‌టుడే: కొత్త క్రిమినల్‌ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం రామన్నపేటలో న్యాయవాదులు జూనియర్‌ సివిల్‌ కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మజీద్, ఐలు జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్త క్రిమినల్‌ చట్టాలు న్యాయ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్వంచ జగతయ్య, లింగయ్య, మొగిలయ్య, యాదయ్య, దినేశ్‌కుమార్, శ్రవణ్‌కుమార్, సత్తయ్య పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని